Site icon vidhaatha

Renu Desai| రేణూ దేశాయ్ పుట్ట‌డం వారి త‌ల్లిదండ్రులకి ఇష్టం లేదా.. ఆమెని ప‌నివాళ్లు పెంచి పెద్ద చేశారా..!

Renu Desai| ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌ద్రి సినిమా స‌మ‌యంలో ఆయ‌న‌తో ప్రేమ‌లో ప‌డిన రేణూ దేశాయ్ కొన్నాళ్లు స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత ప‌వ‌న్‌ని వివాహం చేసుకుంది. పుణేకు చెందిన రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన “బద్రి” సినిమాతో తొలిసారిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలో మరోసారి పవన్ పక్కన నటించింది. అప్పటికే పవన్ కు పెళ్లయిన భార్య దూరంగా ఉండడంతో పవన్, రేణూదేశాయ్ కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశారు. 2018 లో పవన్ రేణూను వివాహం చేసుకున్నారు. అకీరా సమక్షంలో వీరి పెళ్ళి జరగడం విశేషం.. ఇక ఈ దంపతులకు అకీరా , ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బద్రి సినిమా ముందు వరకు రేణుదేశాయ్ ఎవరో కూడా సినిమా లోకానికి తెలియదు. ప‌వ‌న్‌తో సినిమా చేసాక ఆమె అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక పెళ్లి త‌ర్వాత రేణూ దేశాయ్‌కి ఫుల్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అనుకోని కార‌ణాల‌తో 2012లో ప‌వ‌న్ నుండి విడాకులు తీసుకుంది రేణూ. 2003 లో జానీ సినిమా తరువాత సినిమాల్లో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన‌ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ప్రేక్షకుల ని ప‌ల‌క‌రించింది. ఇప్ప‌ట్లో మ‌ళ్లీ సినిమాలు చేసేలా కనిపించ‌డం లేదు. అయితే రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన విష‌యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అబ్బాయి పుడతాడని ఎక్స్‌పెక్ట్ చేస్తే తను పుట్టినందుకు తన తల్లితండ్రులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. నా తండ్రి అయితే మూడు రోజుల వ‌ర‌కు నా ఫేస్ చూడ‌లేదు. అయితే ఆడపిల్ల పుట్టిందని చంపేసిన వారు ఉన్నారు కానీ తన తల్లితండ్రులు చదువుకున్నవారు కాబట్టి తనను చంపలేదంటూ ఎమోష‌న‌ల్ అవుతూ చెప్పింది రేణూ. తల్లిలేని వారి కంటే కూడా తల్లి ఉండి ఆ ప్రేమను పంచకపోవడం నరకమని రేణూ చెప్పింది. నాకు విడాకుల క్నా కూడా నా పుట్టింట్లో పేరెంట్స్ ఆద‌ర‌ణ లేక‌పోవ‌డం బ్యాడ్ పీరియ‌డ్స్ అని చెప్పుకొచ్చింది. తనలాంటి పరిస్థితి తన పిల్లలకు ఎదురు కాకూడదనే అప్పుడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లు రేణు దేశాయ్ చెప్పారు. తనకు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా ఇష్టమని.. రెండు మూడేళ్లలో పిల్లలు పూర్తిగా సెట్ అవుతారని అప్పుడు వివాహం చేసుకుంటాన‌ని పేర్కొంది రేణూ.

Exit mobile version