Site icon vidhaatha

Renu Desai|ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప‌దే ప‌దే గుర్తు చేసుకుంటున్న రేణూ దేశాయ్.. అది ఇంకా గుర్తుంది అంటూ కామెంట్

Renu Desai| ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న బ‌ద్రి అనే చిత్రంలో న‌టించి ఆ మూవీ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి కొన్నాళ్ల స‌హ‌జీవ‌నం త‌ర్వాత ప‌వ‌న్‌ని పెళ్లి చేసుకుంది రేణూ దేశాయ్. వీరికి అకిరా, ఆద్య అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే ప‌వ‌న్‌తో కొన్నాళ్లు సంతోషంగానే ఉన్న రేణూ దేశాయ్ ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకుంది. ప‌వ‌న్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్‌ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయింది. ఆ త‌ర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. కాక‌పోతే అప్పుడ‌ప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఆ మ‌ధ్య ఓ వ్యాపార వేత్త‌తో నిశ్చితార్థం జ‌రుపుకున్న రేణూ దేశాయ్ అత‌నిని రెండో పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంది. కాని పిల్ల‌ల గురించి ఆలోచించి కొన్ని రోజులు ఆగుతాన‌ని పేర్కొంది. అయితే రేణు దేశాయ్‌ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను నానా టార్చ‌ర్ చేశారు. అయితే ఆ స‌మ‌యంలో రేణూ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మీ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకోవచ్చు కానీ.. నేను చేసుకుంటే తప్పా అంటూ వారికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. రెండు మూడేళ్ల త‌ర్వాత తాను త‌ప్ప‌క పెళ్లి చేసుకుంటాన‌ని రేణూ చెబుతుండ‌గా, అప్పుడప్పుడు ఆమె ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని గుర్తు చేసుకుంటూ పెట్టే పోస్ట్‌లు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

తాజాగా రేణు దేశాయ్.. ఖుషి చిత్రంలోని ఏ మేరా జహా అనే సాంగ్ క్లిప్ ని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సాంగ్ కి ఎడిటర్ రేణు దేశాయ్ నే కావడం విశేషం. అయితే ఈ సాంగ్ గురించి రేణు దేశాయ్ చెబుతూ.. ఇది నేను ఫస్ట్ టైం 21 ఏళ్ళ వయసులో ఎడిట్ చేసిన పాట అని పేర్కొంది. ఇందులోని ప్ర‌తి ఫ్రేము నాకు గుర్తుంది అంటూ రేణూ దేశాయ్ స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారగా, దీనిపై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రేణూ ఇంకా ప‌వ‌న్‌ని మ‌ర‌చిపోలేక‌పోతుందేమో అని అంటున్నారు.

Exit mobile version