Renu Desai| ఆరోగ్యం బాగోలేదు.. రూ.3500 సాయం కోరిన రేణూ దేశాయ్

Renu Desai| ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌వ‌న్ తో బ‌ద్రి సినిమాలో న‌టించి ఆ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి కొన్నాళ్లు అత‌నితో డేటింగ్ చేసి చివ‌రికి అత‌నిని వివాహం చేసుకుంది. కొన్నాళ్లు ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నా కూడా ఏదో స‌మ‌స్య‌ల వ‌ల‌న వారు విడి

  • Publish Date - May 16, 2024 / 07:29 AM IST

Renu Desai| ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, న‌టి రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌వ‌న్ తో బ‌ద్రి సినిమాలో న‌టించి ఆ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి కొన్నాళ్లు అత‌నితో డేటింగ్ చేసి చివ‌రికి అత‌నిని వివాహం చేసుకుంది. కొన్నాళ్లు ఈ ఇద్దరు సంతోషంగానే ఉన్నా కూడా ఏదో స‌మ‌స్య‌ల వ‌ల‌న వారు విడిపోయారు. అయితే వారి వైవాహిక జీవితంలో అకీరా, ఆద్య పిల్లలు జ‌న్మించ‌గా ప్ర‌స్తుతం ఆ పిల్ల‌ల‌ని చూసుకుంటూ సంతోషంగా జీవితం గ‌డుపుతుంది రేణూ దేశాయ్. అయితే సుమారు రెండు దశాబ్దాల తర్వాత టైగర్‌ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్ అందులో హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది.

ఇక ఈ సినిమా త‌ర్వాత రేణూ దేశాయ్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుంద‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఆమె సైలెంట్ అయింది. కేవ‌లం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన అనేక విష‌యాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా రేణూ దేశాయ్.. రూ. 3500 కావాలని కోరుతూ త‌న ఇన్‌స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. అందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది..అయితే రేణూ దేశాయ్ పోస్టు చేసిన 5 నిమిషాల్లోనే చాలా మంది అభిమానులు రెస్పాండ్ అయి డ‌బ్బులు కూడా పంపిచారు. అయితే రేణూ దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉంటుంద‌ని, అందుకే అందులో డ‌బ్బులు కావాల‌నే పోస్ట్ ద‌ర్శ‌మిచ్చింద‌ని అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌యంలో రేణూ దేశాయ్ స్పందించింది.

ఇన్ స్టాలో ఆ పోస్టు పెట్టింది తానేనని రేణు దేశాయ్ పేర్కొంది.. తన అకౌంట్ హ్యాక్ కాలేదని చెప్పిన రేణూ…పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని పేర్కొంది. అందుకే వీడియో చేయ‌లేక‌పోయాన‌ని తెలియ‌జేసింది. తాను రూ.3500 అడ‌గ‌డానికి కార‌ణం ఏంటని అంద‌రికి అనుమానం రావొచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నాన‌ని తెలిపింది. నా సంపాదనలో కొంత భాగాన్ని ఎక్కువ‌గా సేవా కార్య‌క్ర‌మాల‌కి ఉప‌యోగిస్తున్నాను. నాక్కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఉన్న‌దంతా ఖ‌ర్చు పెడితే నా పిల్లల పరిస్థితి ఏంటి? నా వరకు సాయం చేశాక.. ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నాను’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. చిన్న పిల్లలు, పెంపుడు జంతువుల కోసం విరాళాలు తీసుకుంటున్నాను. నా పట్ల ప్రేమ, కేర్ చూపించి నా రిక్వెస్ట్‌కు 5 నిమిషాల్లోనే స్పందించి, మానవత్వంతో రూ. 3500 పంపించిన అందరికీ ధన్యవాదాలు అని రేణు దేశాయ్ త‌న పోస్ట్ ద్వారా తెలియ‌జేసింది.

Latest News