Rohit Sharma| టీమిండియా ఫైన‌ల్‌కి వెళ్ల‌డంతో క‌న్నీరు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్

Rohit Sharma| వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ వ‌ర‌కు చేరిన భార‌త జట్టు టైటిల్ పోరులో త‌డ‌బ‌డి ఆస్ట్రేలియాపై ఓడింది. ఎంతో మంది భార‌త క్రికెట్ అభిమానులు భార‌త్ క‌ప్ గెలుస్తుంద‌ని ఆశించారు. కాని ఆ ఆశ నెర‌వేర‌లేదు. ఆ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ క‌న్నీళ్లు పె

  • Publish Date - June 28, 2024 / 08:55 AM IST

Rohit Sharma| వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ వ‌ర‌కు చేరిన భార‌త జట్టు టైటిల్ పోరులో త‌డ‌బ‌డి ఆస్ట్రేలియాపై ఓడింది. ఎంతో మంది భార‌త క్రికెట్ అభిమానులు భార‌త్ క‌ప్ గెలుస్తుంద‌ని ఆశించారు. కాని ఆ ఆశ నెర‌వేర‌లేదు. ఆ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ అద్భుతంగా రాణిస్తుంది. ఇంత వ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడ‌ని భార‌త జ‌ట్టు గత టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీ ఫైనల్లో మ‌న‌ల్ని చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్‌ని దారుణంగా ఓడించి స‌గ‌ర్వంగా ఫైన‌ల్‌కి వెళ్లింది. ఈ క్ర‌మంలో రేపు సౌతాఫ్రికాతో తుది పోరులో త‌ల‌ప‌డ‌నుంది.

అయితే సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ స‌మ‌యంలో కోహ్లి రోహిత్‌ని ఓదార్చాడు. అయితే ఈ ఘటన భారత క్రికెట్‌ అభిమానులను సైతం భావోద్వేగానికి గురి చేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోనే టీమిండియా ఆడడ‌గా, అప్పుడు సెమీస్ వ‌రకు చేరిన భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడింది. ఇక 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో కూడా ఫైన‌ల్ వ‌ర‌కు దూసుకెళ్లిన భార‌త జ‌ట్టు తుదిపోరులో ఆసీస్ చేతిలో ఓడింది.

చేతి వ‌రకు వ‌చ్చిన క‌ప్ చేజారిపోవ‌డంతో టీమిండియాతో పాటు అభిమానులు కూడా చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే ఈ సారి మాత్రం క‌ప్ చేజిక్కించుకునే అవ‌కాశాన్ని అస్స‌లు మిస్ చేసుకోవ‌ద్దని రోహిత్ అండ్ టీం భావిస్తుంది. సౌతాఫ్రికా టీం కూడా చాలా ప‌టిష్టంగా ఉండ‌గా, ఆ టీంని ఓడించి భార‌త్ క‌ప్ సాధించ‌డం కాస్త క‌ష్టంతో కూడుకున్న ప‌ని. అయితే కాస్త నైపుణ్యం ప్ర‌ద‌ర్శించి ఆడితే మాత్రం భార‌త్‌కి క‌ప్ గెల‌వ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. కాగా, సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు మంచి స్కోర్‌ చేసింది. 172 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్‌ అయిపోయింది.

Latest News