విధాత: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఛాంపియన్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ మూవీపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఈ సినిమాతో మళయాళ కుట్టి అనస్వర రాజన్ హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడిగా 2016లో ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్..శ్రీలీలతో కలిసి దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో హిట్ సాధించారు. ఆ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దీంతో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఛాంపియన్ చిత్రం రోషన్ కెరీర్‌కు కొత్త ఊపు ఇవ్వాలని అశిస్తున్నారు. ప్రస్తుతం రోషన్ ఛాంపియన్ తో పాటు మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వృషభ’లో చేస్తున్నారు. మోహన్ లాల్ తనయుడిగా రోషన్ నటిస్తుండగా… ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ షనయా కపూర్ నటిస్తున్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీతో రూపొందించబోతున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.