విధాత:లాక్ డౌన్ తర్వాత సినిమాలన్నీ తమ షూటింగ్ అప్ డేట్స్ ను ఘనంగా ప్రకటించాయి. సెట్స్ పైకి వస్తున్నట్టు ప్రెస్ నోట్స్ రిలీజ్ చేశాయి. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం సైలెంట్ గా సెట్స్ పైకి వచ్చింది.
అవును.. ఆర్ఆర్ఆర్ మూవీ ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. ముందుగా రామ్ చరణ్ సెట్స్ పైకి వచ్చాడు.తను ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ ప్రారంభించినట్టు చరణ్ స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు ఓ ఫొటో కూడా రిలీజ్ చేశాడు. ఇన్నాళ్లూ ఆర్ఆర్ఆర్ కోసం గడ్డం పెంచి, హెయిర్ స్టయిల్ మార్చిన చరణ్.. ఈరోజు షూటింగ్ కు మాత్రం సరికొత్త హెయిర్ స్టయిల్, క్లీన్ షేవ్ లో హాజరయ్యాడు. చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ లోచరణ్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడేమో.
ఎన్టీఆర్ మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. నిజానికి ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వాలి.చరణ్-తారక్ పై ఇంట్రో సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. దాదాపు 20 రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందని టాక్.
ReadMore:మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా