Site icon vidhaatha

టీఎన్నార్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్థికసాయం :సంపూర్ణేశ్ బాబు

కరోనాతో మృతి చెందిన సినీ జర్నలిస్టు టీఎన్నార్ భార్య జ్యోతి ఖాతాలో నగదు జమ చేసిన సంపూ
టీఎన్నార్ వలన తనకెంతో మేలు జరిగిందని వెల్లడి ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇతరులు కూడా సాయం చేయాలని విజ్ఞప్తి ప్రముఖ సినీ పాత్రికేయుడు టీఎన్నార్ కరోనా మహమ్మారికి బలైన నేపథ్యంలో ఆయన కుటుంబానికి నటుడు సంపూర్ణేశ్ బాబు ఆర్థికసాయం చేశారు. టీఎన్నార్ అర్ధాంగి జ్యోతి బ్యాంకు ఖాతాలో తాను రూ.50 వేలు జమ చేసినట్టు సంపూర్ణేశ్ బాబు వెల్లడించారు.

టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా,కెరీర్ పరంగా ఒక మెట్టు పైకెదిగానని వినమ్రంగా తెలిపారు. ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూ మాటిచ్చారు. ఇతరులు కూడా టీఎన్నార్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. తన ట్వీట్ లో టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నెంబరు, తదితర వివరాలను పంచుకున్నారు.

Exit mobile version