Site icon vidhaatha

Allu Arjun| అల్లు అర్జున్ త‌న అభిమానుల‌ని తంతాడు, కొడ‌తాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన గ‌బ్బ‌ర్ సింగ్ క‌మెడీయ‌న్

Allu Arjun| గ‌త కొద్ది రోజులుగా అల్లు అర్జున్ వ్య‌వ‌హారం నెట్టింట హాట్ టాపిక్ అయింది. సొంత ఫ్యామిలీకి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ప్ర‌చారం చేయ‌కుండా వేరే పార్టీకి చెందిన వ్య‌క్తి కోసం నంద్యాల వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. అదే సమయంలో నాగ బాబు ట్వీట్ చేయడం.. ఆ తర్వాత ట్విట్టర్ ను డీయాక్టివేట్ చేసి యాక్టివేట్ చేయడం.. పవన్ గెలిచాక మెగా సెలబ్రేషన్స్ కు అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఎవ‌రు రాక‌పోవ‌డం అంతా కూడా ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అయితే నాగబాబు, సాయిథరమ్ తేజ్‌లు అల్లు అర్జున్‌పై తమ ఆగ్రహాన్ని నేరుగా చూపించ‌డంతో మెగా ఫ్యాన్స్ బ‌న్నీకి ఎగైనెస్ట్ అయ్యారు.

గ‌త కొద్ది రోజులుగా అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ వ‌ల్ల‌నే బన్నీ లేటెస్ట్ మూవీ పుష్ప – 2 వాయిదా పడడం జ‌రిగింద‌నే ప్ర‌చారం కూడా న‌డిచింది.ఇక ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కళ్యాణ్ న‌టించిన సూపర్ హిట్ చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌లో న‌టించిన సాయిబాబా తాజాగా అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. పవన్ కు వీరాభిమాని అయిన సాయి బాబా.. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం నాగబాబు పెట్టిన పోస్ట్ అక్షరాలా నిజమన్నారు. “నాగబాబు గారు చెప్పినట్లు బయటోడైనా.. ఇంటోడైనా.. మనకు అగైనెస్ట్ ఉన్నోడికి సపోర్ట్ చేస్తే బయటోడే.. పుష్ప-2లో అవ‌కాశం వ‌చ్చే అవ‌కాశం ఉంది. అందులో ఛాన్స్ వ‌చ్చిన నేను బ‌న్నీతో ప‌ని చేయ‌ను.

అల్లు అర్జున్ త‌న డై హార్డ్ అభిమానుల‌ని తన్నడం కొట్టడం చూశాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్లేదు. పుష్ప-2 డేట్ ఇంకా ఛేంజ్ చేసుకుంటూ ఉండాల్సిందే” అంటూ వ్యాఖ్యానించారు. ఏ హీరో అలా చేసినా నచ్చదని.. హిట్లు, ఫ్లాప్‌లు ఎన్నో వస్తాయని కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మరిచిపోకూడదని సాయిబాబా తెలిపారు. బ‌న్నీకి చాలా ఇగో ఉంద‌ని అది త‌గ్గించుకుంటే ఆయ‌న‌కే మంచిదంటూ సాయి బాబా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Exit mobile version