Site icon vidhaatha

Sai Pallavi|తండేల్ ప్రెస్ మీట్‌లో చైతూని చూసి సిగ్గుప‌డ్డ సాయి ప‌ల్ల‌వి..హోరెత్తిన ఆడిటోరియం

Sai Pallavi|యువ సామ్రాట్ నాగ చైతన్య, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి కాంబోలో ల‌వ్ స్టోరీ అనే చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇదే కాంబోలో చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రం రూపొందింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ‘తండేల్’ సినిమా 7 ఫిబ్రవరి, 2025న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు తెలియ‌జేశారు. వాలెంటైన్స్‌డే కి ముందు సినిమా రిలీజ్ కావడం, సీజన్‌లోని రొమాంటిక్ మూడ్‌ను క్యాపిటిలైజ్ చేసుకునే పర్ఫెక్ట్ ఆపర్చునిటీగా ఈ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ ప్రెస్ మీట్‌లో నాగ చైత‌న్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సాయి పల్లవితో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని.. సినిమాలో తన సీన్స్ గురించే కాకుండా అందరి సీన్స్ గురించి కూడా మాట్లాడేదని గుర్తు చేసుకున్నాడు. బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి.. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి సినిమాలో క్యారెక్టర్స్‌ గురించి చర్చించేది. పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కొంచెం భ‌యం వేసేది. ఎప్పుడు నాకు స‌పోర్ట్‌గా ఉంటూ డ్యాన్స్ విష‌యంలో చాలా స‌పోర్ట్ చేసింది అని నాగ చైత‌న్య అన్నాడు. అయితే సాయి ప‌ల్ల‌విని చైతూ.. బాక్సాఫీస్ క్వీన్ అని సంభోదించగానే వేదికపై సాయి పల్లవి సిగ్గుపడిపోగా.. ఆడిటోరియం కేరింతలతో మార్మోగిపోయింది.

ఇక సాయి ప‌ల్లవి.. నాగ చైత‌న్య‌పై కూడా ప్ర‌శంస‌లు కురిపించింది. ‘‘నాగచైతన్య గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు తండేల్ ప్రాజెక్ట్ కోస‌మే ప‌ని చేస్తున్నారు. కనీసం వేరే ప్రాజెక్ట్ గురించి కూడా ఆలోచించడం లేదు. క‌నీసం త‌న‌ లుక్ కూడా మార్చుకోలేదు. తండేల్ సినిమాపై అతనికి ఉన్న నమ్మకం ఇది. 4 సినిమాలు చేస్తే వచ్చే పేరు.. ఈ తండేల్ సినిమాతో చైతన్యకి వ త‌ప్ప‌క స్తుంది. నేనేమీ బాక్సాఫీస్ క్వీన్ కాదు.. వీళ్లు నన్ను టీజ్ చేస్తున్నారు. స్క్రిప్ట్, క్యారెక్టర్‌ బాగా ఉండి.. ప్రేక్షకులకి నచ్చితేనే బాక్సాఫీస్ మాటలన్నీ’’ అని సాయి ప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాస్ గారు నాకు ఎలాంటి అవార్డు వచ్చినా, నా సినిమా సక్సెస్ సాధించినా ఎంతగానో గౌరవించి, సన్మానిస్తారు. ఒక కూతురులా చూసుకుంటారు. దానికి నేను థాంక్యూ తప్ప ఇంకేం చెప్పలేను. మంచి కంటెంట్ ఎప్పుడు వస్తుందో జనాలకి అప్పుడు నచ్చేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ నచ్చాలని కోరుకుంటాను అని అన్నారు సాయి ప‌ల్ల‌వి.

Exit mobile version