Site icon vidhaatha

Sai Tej| బ‌న్నీని దూరం పెడుతున్న మెగా ఫ్యామిలీ.. మొన్న నాగ‌బాబు, ఇప్పుడు సాయి తేజ్

Sai Tej| గ‌త కొద్ది కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంది. ఎప్పుడైతే ఓ ఈవెంట్‌లో అల్లు అర్జున్ చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో కామెంట్ చేయ‌గా, అప్ప‌టి నుండి బ‌న్నీని మెగా ఫ్యామిలీ ఏదో ఒక సంద‌ర్భంలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసిపిఅభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించ‌డంతో మెగా ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసినా, వైసిపి అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు, మెగా అభిమానులకు ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు. అల్లు అర్జున్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం మెగా బ్ర‌దర్ నాగ‌బాబు.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టారు మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ త‌ర్వాత అల్లు అర్జున్‌ని ఉద్దేశించే నాగ‌బాబు ఈ పోస్ట్ పెట్టాడని చ‌ర్చ జ‌రిగింది. దీనిపై బ‌న్నీ అభిమానులు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డంతో ట్వీట్ డిలీట్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఈ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జ‌ర‌గ‌గా, ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ అంతా బ‌స్సు వేసుకొని మ‌రీ వెళ్లారు.

అయితే అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు. క‌ట్ చేస్తే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా త‌న .. సోషల్ మీడియాలో బన్నీని, ఆయ‌న భార్య‌ని కూడా అన్‌ఫాలో చేశారని అంటున్నారు. ఇటు ఇన్‌స్టాగ్రామ్, అటు ట్విట్టర్ (ఎక్స్‌)‌‍లో కూడా అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశారు సాయి తేజ్. అల్లు శిరీష్‌ను మాత్రం ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు సాయి తేజ్. అయితే సాయితేజ్ అన్‌ఫాలో చేసిన మిగ‌తా మెగా హీరోలు అంద‌రు మాత్రం బ‌న్నీని ఫాలో అవుతున్నారు. ఈ ప‌రిణామాల మ‌ధ్య నెట్టింట అల్లు వర్సెస్ మెగా చ‌ర్చ మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా మారింది.

Exit mobile version