Site icon vidhaatha

Salman Khan| బిష్ణోయ్ బెదిరింపుల‌తో దుబాయ్ నుండి స‌ల్మాన్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కారు

Salman Khan| బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ బాలీవుడ్ హీరోల‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో.ఖాన్ త్ర‌యంలో కూడా సల్మాన్‌కి విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టికీ కూడా కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు స‌ల్మాన్ ఖాన్. అయితే ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు బిగ్ బాస్ షో చేసుకుంటూ వెళ్లుతున్న‌ సల్మాన్ ఖాన్ (Salman Khan) కు ప్రాణహాని ఉంది. ఆయన ప్రాణాలు తీయడమే తమ లక్ష్యం అన్నట్లుగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. ఇటీవ‌ల‌అత‌డి స్నేహితుడు సిద్ధిఖ్ ని చంపేయ‌డంతో ఇప్పుడు స‌ల్మాన్ కుటుంబం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది. స‌ల్మాన్, అత‌డి ఇంటి చుట్టూ హైసెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు.

గ‌త కొద్ది రోజులుగా బిష్ణోయ్(Bishnoi) బెదిరింపులు సీరియస్ కావడంతో ‌ ఫారిన్ నుంచి స్పెషల్ కార్ తెప్పిస్తున్నారు స‌ల్మాన్ ఖాన్(Salman Khan). నిస్సాన్ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎస్‌యువీని సల్మాన్ ఖాన్ కోసం ఆర్డర్ చేశారు. అది బుల్లెట్ ప్రూఫ్ కార్.‌ ఇండియాలో లభించడం లేదు. సల్మాన్ కోసం దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు. దాని ఖరీదు సుమారు రెండు కోట్ల రూపాయలు అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సల్మాన్ ఖాన్ ఓ బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేయ‌గా, ఇప్పుడు మ‌రొక‌టి ఆర్ట‌ర్ చేసిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిని ఇండియాకి తెప్పించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న కారు స్పెసిఫికేషన్‌ల ప్రకారం..నిస్సాన్ ఎస్‌.యు.వి అనేక అధునాతన భద్రతా ఏర్పాట్ల‌ను కలిగి ఉంది. పేలుడు హెచ్చరిక సూచికలు, పాయింట్-బ్లాంక్ బుల్లెట్ షాట్‌లను నిరోధించడానికి మందపాటి గాజు షీల్డ్‌లు, డ్రైవర్ లేదా లోప‌ల ఉన్న‌ ప్రయాణీకులను గుర్తించకుండా మ‌భ్య పెట్టే బ్లాక్ షేడ్స్ వ‌గైరా ఏర్పాటు చేశారు.ఏకే 47 గన్ నుంచి వచ్చే బుల్లెట్లను ఆపగలిగే అత్యంత శక్తిమంతమైన అద్దాలను అమర్చడం వల్ల కారు బాడీ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ అని చెబుతున్నారు ఈ మ‌ధ్య స‌ల్మాన్ ఖాన్‌కి ఎక్కువ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. షూటింగ్స్ చేయడానికి స్టూడియోలకు రావడం గానీ, ఇతర ఫంక్షన్స్ వంటివి హాజరు అయినా గానీ చాలా చెకింగ్ న‌డుస్తుంది. బాలీవుడ్ పాపరాజీ ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చే స‌మ‌యంలో తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ అందిస్తోంది. ఇది హై లెవెల్ సెక్యూరిటీ అని చెప్పాలి.

Exit mobile version