Salman Khan|బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి వరుస బెదిరింపులు వస్తుండడంతో ఆయనకి భద్రత పెంచేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యుల నుంచి సల్మాన్ ఖాన్‌కి వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇటీవల తాము లారెన్స్ బిష్ణోయికి సంబంధించిన వారమని, వెంటనే సల్మాన్ ఖాన్ తమకు రూ. 5 కోట్లు చెల్లించకపోతే, అతడిని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ హెల్ప్ లైన్ వాట్సాప్ నంబర్ కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో . ‘మై సికందర్ హూన్’ పాట రాసిన గీత రచయితను చంపేస్తామని ఆ మెసేజ్‌లో ఉంది.సల్మాన్ ఖాన్ కు ఎవరైనా సహాయం చేస్తే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ షూటింగ్స్‌లో పాల్గొనాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికిందర్’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జరుగుతోంది. సిటీలో రాయల్ హోటల్‌గా గుర్తింపు ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. అయితే సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణగా 70 మందికిపైగా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్ఎస్‌జీ కమాండోలతో పాటు పోలీస్ సిబ్బంది, వ్యక్తిగత రక్షణ దళం ఉంది. ఈ క్రమంలో నాలుగు లేయర్ల భద్రతను సల్మాన్‌కు కల్పించారు. ఇప్పటికే సల్మాన్‌కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే. సల్మాన్ భద్రత నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అది ‘సికిందర్’ టీమ్‌కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చిత్రబృందం కూడా మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా కూడా బెస్ట్ బాడీగార్డ్స్ ని సెలెక్ట్ చేసి తన టీమ్ లో చేర్చుకున్నాడని తెలుస్తోంది.వారందరు సల్మాన్ ఖాన్‌ని కంటకి రెప్పలా కాపాడుతున్నారు. కాగా, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సల్మాన్ ఖాన్.. 19908లో కృష్ణ జింకను వేటాడటంతో బిష్ణోయ్ వర్గం ఆయనపై కేసు పెట్టింది. ఈ కేసులో సల్మాన్ జైలుకెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అదే వర్గానికి చెందిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతోంది. గత నెలలో ఆయన స్నేహితుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని బిష్ణోయ్ గ్యాంగ్ హత్యచేసింది. ఈ హత్య తర్వాత సల్మాన్‌ను చంపుతామని ముంబయి పోలీసులకు పలు మెసేజ్‌లు రావడం కలకలం రేపుతుంది.