సమంత రుత్ ప్రభుతో విడాకులు తీసుకున్న తర్వాత మోడల్, సినీ నటి శోభిత ధూళిపాళ్లతో ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏం మాయ చేశావే, మజిలీతోపాటు అక్కినేని కుటుంబంలో ఏఎన్నార్ సహా నాలుగు తరాల హీరోలు నటించిన మనం వంటి సినిమాల్లో సమంత కూడా నటించింది. అయితే.. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు శోభిత ధూళిపాళ్లను డిసెంబర్ 4వ తేదీన అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకునేందుకు నాగ చైతన్య సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలోనే పెళ్లికి ముందు కార్యక్రమాలు ఉత్సాహపూరితంగా సాగుతున్నాయి. ఇటీవలే మంగళస్నానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సోదరిపై ప్రేమతో సమంత కూడా హాజరై అద్భుతమైన చిత్రాలను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో తన సోదరిపట్ల ప్రేమ, ఆప్యాయతలను సమంత చాటుకోవడం కనిపిస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో నాగ చైతన్య, శోభిత ముచ్చగొలిపారు. అయితే.. శోభిత అక్క అయిన సమంత వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె తన చెల్లెలికి ప్రేమపూర్వకంగా పసుపు రాస్తున్న ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఉత్సవానికి ఖరీదైన డిజైనర్ దుస్తులు కాకుండా.. తన తల్లి, అమ్మమ్మ దుస్తులు, నగలు ధరించి డాక్టర్ సమంత హాజరయ్యారు.