Site icon vidhaatha

Samantha|బిజినెస్‌ల మీద బిజినెస్‌లు మొద‌లు పెట్టేస్తున్న స‌మంత‌.. ఈ డ‌బ్బంతా ఏం చేస్తుంది..!

Samantha| అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇప్పుడు ట‌ఫ్ ఫేజ్‌లో ఉంది. నాగ చైత‌న్య‌తో విడాకులు ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డం, ప‌లు ఇబ్బందులు ఎదురైన అన్నింటిని త‌ట్టుకొని స‌మంత ధైర్యంగా నిల‌బ‌డింది. ఆమె ధైర్యాన్ని చాలా మంది ప్ర‌శంసిస్తున్నారు.అయితే స‌మంత ఇప్పుడు సినిమాలు అంత‌గా చేయ‌డం లేదు కాని బిజినెస్ వెంచర్‌లలో విజయం సాధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా పోగొట్టుకున్న చాలా మంది ఇతర నటీమణుల మాదిరిగా కాకుండా, సమంత వివిధ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా తన సంపాద‌న‌ని పెంచుకోగలిగింది. సమంతా చాలా కాలంగా ఈ-కామర్స్ దుస్తుల వ్యాపారంలో సాకి అనే బ్రాండ్ తో బిజినెస్ చేస్తోంది.

హైదరాబాద్‌లోని పిల్లల కోసం ఒక కాన్సెప్ట్ స్కూల్‌లో కూడా పెట్టుబడి పెట్టిందట. ఇది ఆమె మనసుకు దగ్గరైన ప్రత్యేకమైన వెంచర్ అని తెలుస్తోంది. సమంత వీలయినంత వరకు సంపాదించిన దాంట్లో కొంత ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తోంది. ఫ్యాషన్, స్కూల్స్, హోటల్స్.. పలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టగా తాజాగా మరో కొత్త బిజినెస్ లో పెట్టుబడులు పెట్టింది. ఈ సారి ఏకంగా స్పోర్ట్స్ బిజినెస్ లోకి దిగింది. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజ్ లో పార్ట్నర్ గా పెట్టుబడులు పెట్టింది. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు గౌరవ్ నటేకర్ తో కలిసి సమంత పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంజైజ్ ని తీసుకుంది. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది.

పికెల్ బాల్ చెన్నై ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నాను అంటూ గౌరవ్ తో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి సమంత ఈ విషయాన్ని తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితం ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’ స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్ కి ఈ పేరు పెట్టినట్టు ఆమె వెల్లడించారు. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచలను ప్రోత్సహిస్తానంటూ స‌మంత చెప్పుకొచ్చారు.. అర్థవంతమైన, యూనివర్సల్ కథలను తెరకెక్కిస్తామని తెలిపారు. సమాజంలోని సంక్లిష్టతలు, బలాలను ప్రజలకు తెలియజేసే విధంగా తమ సినిమాలు తెరకెక్కుతాయని చెప్పారు. అయితే స‌మంత తన సంపాద‌న‌లో కొంత భాగం సోష‌ల్ స‌ర్వీస్ కోసం కూడా ఉప‌యోగిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

Exit mobile version