Samantha|సమంత ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లలో ఒకరు. ఆమె చేసే సినిమాలకి అభిమానులలో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. అయితే సమంత నటించిన సిటడెల్ హనీ బన్నీ నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సిటడెల్ స్పై యూనివర్స్ నుంచి ఈ ఇండియన్ వెర్షన్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ మధ్య ఓ హాట్ కిస్ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సమంత ఈ వెబ్ సిరీస్‌లలో రెచ్చిపోయి మరీ నటించిందని అంటున్నారు. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత బోల్డ్ సీన్లకు అంతా ఫైర్ అయ్యారు. అసలు ఈ సిరీస్ వల్లే చై, సామ్ మధ్య గొడవలు వచ్చాయని కూడా అన్నారు. ఇక ఇప్పుడు సమంత అంతకు మించి అనేలా సిటాడెల్‌లో రెచ్చిపోయింది. ఇది చూసిన కొంతమంది సమంత ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. నిజానికి గతంలోనూ సామ్ కొన్ని లిప్ లాక్ సీన్లలో కనిపించినా.. సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో మాత్రం వరుణ్ ధావన్ తో ఓ అడుగు ముందుకేసిందని అంటున్నారు. ఇందులో చాలా సీన్స్ శృతి మించేలా ఉన్నాయని రానున్న రోజులలో సమంత మరింత రెచ్చిపోవడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు.
‘సిటాడెల్ హనీ బన్నీ’లో రొమాంటిక్ సన్నివేశాలు అంతగా ఏమి లేవు. ఏదో ఉన్న ఒక ట్రెండు సన్నివేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇందులో సమంత యాక్షన్ సీన్లు బాగా చేశారని కామన్ ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.. వరుణ్ ధావన్ కంటే ఆమెకు యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉండడంతో పాటు వాటిని బాగా డిజైన్ చేశారు.రాజ్ అండ్ డీకే అద్భుతమైన డైరెక్షన్ తోపాటు సమంత, వరుణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. యాక్షన్ సీన్స్ బాగా ఉన్నాయనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.