Site icon vidhaatha

Samantha|చైతూ ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత వెలుగులోకి స‌మంత బాయ్‌ఫ్రెండ్‌.. త్వ‌ర‌లో ఆమె పెళ్లి కూడానా..!

Samantha| ప్రేమించుకొని పెద్ద‌ల‌ని ఒప్పించి ఎంతో గొప్ప‌గా పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య‌, స‌మంత జంట‌. ఈ జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో 2021లో విడాకులు తీసుకొని దూర‌మ‌య్యారు. ఆ స‌మ‌యంలో స‌మంత చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది. సమంతది తప్పని ఎక్కువ మంది అంటే .. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వార్త‌లలో నిలిచింది.

అయితే నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నాడని కొన్నాళ్లుగా జోరుగా ప్ర‌చారాలు సాగాయి. వాటిని ఈ ఇద్ద‌రు ఖండించ‌లేదు. కాని సైలెంట్‌గా జంట నిశ్చితార్థం జ‌రుపుకొని షాకిచ్చారు. త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇక సమంత రాజ్ నిడుమోరు అనే వ్యక్తితో డేటింగ్ లో ఉందనే ప్ర‌చారం ఉంది. సమంతని ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ కి పరిచయం చేసారు రాజ్ &డీకే ఆమెతో సిటాడెల్ కూడా చేశారు. అయితే వీరిలో రాజ్ నిడుమోరుతో సమంత చాలా సాన్నిహిత్యంగా ఉంటుంద‌ని, అత‌నితో డేటింగ్‌లో ఉంద‌నే ప్ర‌చారం కూడా ఉంది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ స‌మ‌యంలో రాజ్ – సమంత మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరు ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని, లవ్ లో ఉన్నారని ఇప్పుడు బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.సమంత పుట్టిన రోజుని రాజ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడ‌నే టాక్ కూడా ఉంది. ఇప్పుడు సమంత – రాజ్ లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని త్వ‌రలో వారిద్ద‌రి నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంద‌నే ప్ర‌చారం కూఆ సాగుతుంది. నాగ చైతన్య – శోభిత నిశ్చితార్థం తర్వాతే ఈ జంట గురించి బయటకు రావడంతో ఈ విష‌యం నెట్టింట చర్చగా మారింది. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Exit mobile version