Site icon vidhaatha

Samantha:మెడలో నల్లపూసల దండ వేసుకున్న సమంత.. అందుకేనా?

Samantha: సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిమానులు హీరోహీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి పెద్ద టైమ్ పట్టడం లేదు. టాలీవుడ్ లో అందరి కన్నా.. హీరోయిన్ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అభిమానులు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంతలు క్యూట్ ఎంటర్ టైనింగ్ కపుల్ గా పేరు తెచ్చుకోవడంతో వీరిద్దరూ పలు కారణాల విడిపోయినప్పుడు అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిస్తే బావుండు అని ఎన్నో సందర్భాల్లో అనుకున్నారు. ఇక వీరిద్దరూ అఫిషియల్ గా విడాకులు తీసుకుని దాదాపు రెండేళ్లు పైగా అయినా కూడా వీరిద్దరి విడాకుల టాపిక్ రాగానే చాలా అలర్ట్ అవుతున్నారు.

అలాంటిది సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో నల్లపూసలు వేసుకుని దిగిన ఫోటో ఒకటి షేర్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో దుమారం మొదలైంది. విడాకులు తీసుకున్న సమంత మెడలో నల్లపూసలు ఎందుకు వేసుకుంది అనే సందేహంతో ఈ ఫోటో కాస్త ఆమె షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది. సమంత ఎందుకు నల్లపూసలు వేసుకుంది అంటూ నెట్టింట ఎన్నో ప్రశ్నలు వేస్తున్నారు అభిమానులు.. కొంతమంది రెండో పెళ్లి చేసుకుందా అని అడుగుతుంటే.. మరికొంతమంది ఈ ఫోటో షూటింగ్ స్పాట్ ది అంటున్నారు. సమంత యాక్ట్ చేస్తున్న ఓ యాడ్ షూట్ కి సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరికొంతమంది అయితే ఏకంగా నాగచైతన్య మీద ఉన్న ప్రేమ, పెళ్లిపై ఉన్న గౌరవంతోనే సమంత ఇంకా తన మెడలో నల్లపూసలు వేసుకుందని అంటున్నారు. ఏది ఏమైనా గానీ ప్రజంట్ అయితే సామ్ తన మెడలో వేసుకున్న నల్లపూసల కారణంగా మరోసారి వైరల్ అవుతుంది. ప్రజంట్ ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి మూవీలో యాక్ట్ చేస్తుంది. సిడాటల్ అనే వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేస్తుంది. ఇకపై సమంత తన సినిమాలకు బ్రేక్ ఇస్తుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా సమంత ఇంకే ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు. ఏడాది పాటు స‌మంత సినిమాల‌కి గ్యాప్ తీసుకిని త‌న ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్ట‌నుంద‌ట‌.

Exit mobile version