Samantha| అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట ‘ఏమాయ చేశావే’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత ఆటోనగర్ సూర్య అనే చిత్రం ఈ ఇద్దరి కాంబోలో రూపొందగా ఆ సమయంలో ప్రేమలో పడ్డారు. ఇక కొన్నాళ్ల పాటు పీకల్లోతు ప్రేమాయణం నడిపించిన ఈ జంట కొన్నాళ్లకి విడాకులు తీసుకున్నారు. అనంతరం సమంత మయోసైటిస్ బారిన పడడం,ఈ క్రమంలో సినిమాలకి బ్రేక్ ఇవ్వడం మనం చూశాం. ఇక అనారోగ్యం నుండి బయటపడేందుకు సమంత రకరకాల పద్దతులని ప్రయత్నించింది. మునుపటిలా జిమ్‌లో కసరత్తులు చేస్తూ బరువుల్నిఎత్తింది. యోగసనాలు సైతం చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన విడాకులు, మయోసైటిస్ విషయాల గురించి ప్రస్తావించింది. జీవితంలో కొన్ని విషయాలని మార్చుకోవాలని మనందరం కోరుకుంటాం. విశ్వాసమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. విశ్వాసం మిమ్మల్ని ప్రశాంతంగానూ ఉంచుతుంది. విశ్వాసం మీ గురువుగా మరియు మీ స్నేహితునిగా మారి మానవాతీతంగా చేస్తుంది అని పేర్కొంది. గత మూడు సంవత్సరాలు నేను పడ్డ కష్టం మళ్లీ రాకూడదని అనుకున్నాను. కాని ఇప్పుడు నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన డీల్ చేయడానికి సిద్ధంగా ఉండేందుకు సమాయత్తమయ్యాను అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది..
గతంలో కన్నా ఇప్పుడు బలంగా మారాను. అందుకు కారణం ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోవడమే అని నేను భావిస్తున్నాను. ఇది నా జీవితంలోని అన్ని అంశాలని ప్రభావితం చేస్తుంది. సంఘర్షణ, అవగాహన నాకు ఎంతో కలగజేసింది. అడ్డంకులని అధిగమించడానికి ఆధ్మాత్మికత నాకు అవసరమైన బలంగా మారింది. ఆధ్యాత్మికత అంతులేని శక్తిగా ఉంటుందని నేను నమ్ముతాను అని సమంత పేర్కొంది. ఇక సమంత 2017 అక్టోబర్‌లో నాగ చైతన్యని వివాహం చేసుకోగా, 2021 అక్టోబర్‌లో విడాకులు తీసుకుంది.