Samantha| పెళ్లి బ‌ట్ట‌లు చించేయ‌డ‌మేంటి స‌మంత‌… అవాక్క‌వుతున్న అభిమానులు

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. ఏమాయ చేశావే సినిమాతో హీ

  • Publish Date - April 26, 2024 / 12:10 PM IST

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంది. టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్ స‌మ‌యంలో సమంత అక్కినేని హీరో నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకుంది. 2017 అక్టోబ‌ర్ 6,7 తేదీల‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జ‌రిగింది. హిందూ, క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వివాహ జ‌రిగింది.అయితే పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. 2021లో వీరిద్ద‌రు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

స‌మంత హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన పెళ్లిలో రామానాయుడి స‌తీమ‌ణి చీర‌ని రీమోడ‌లింగ్ చేయించి క‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇక క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్రకారం జ‌రిగిన వివాహంలో తెల్ల‌ని గౌనుని ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించి వేసుకుంది. అయితే ఇప్ప‌డు దానిని ఓ అవార్డ్ ఫంక్ష‌న్ కోసం రీమోడ‌లింగ్ చేయించి వేసుకుంది .ఎల్లే స‌స్టైన‌బిలిటీ అవార్డ్ ఫంక్ష‌న్ కార్య‌క్ర‌మంకి హాజ‌రైంది స‌మంత‌. అందులో త‌న‌ని ఎల్లే లీడ‌ర్స్ ఆఫ్ చేంజ్‌గా ఎంపిక చేశారు. ఆ కార్య‌క్ర‌మానికి స‌మంత బ్లాక్ డ్రెస్‌లో చాలా హాట్‌గా మెరిసింది. తెలుపు రంగు గౌనుని ఇలా బ్లాక్ క‌లర్‌కి మార్చి వేసుకుంది.

ఇక త‌న‌కెంతో ఇష్ట‌మైన గౌనుని రీమోడ‌లింగ్ చేసిన క్రేశా బ‌జాజ్‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. జీవన‌శైలిని మ‌రింత అందంగా మార్చుకోవ‌డం కోసం పాత దుస్తుల‌ని రీమోడ‌లింగ్ కూడా చేయించుకోవ‌డం ఒక‌టి అంటూ స‌మంత త‌ను షేర్ చేసిన వీడియోకి కామెంట్ గా పెట్టింది . ప్ర‌స్తుతం స‌మంత లుక్స్ అయితే సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆమె హాట్‌నెస్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. ఇక నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత స‌మంత‌ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. చివ‌రిగా విజ‌య్ దేవరకొండతో కలిసి ‘ఖుషి చిత్రం చేసింది. ఆ త‌రువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు.ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Latest News