Samantha – Raj Nidimoru | విధాత: నటి సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు మరోసారి ఒకే కారులో కలిసి కనిపించారు. వారిద్దరు ఓ రెస్టారెంట్ లో డిన్నర్ కు ఒకే కారులో కలిసి వెళ్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుకు దగ్గరైనట్లుగా..వారిద్ధరు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాటిపై అధికారికంగా వారిద్దరూ బయటపడలేదు. తరచూ వారిద్దరూ వెకేషన్స్‌కు కలిసి వెళ్లిన ఫోటోలు కూడా వారి మధ్య బంధానికి నిదర్శనంగా కనిపించాయి.
‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించిన సమయంలో రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడింది. సమంతతో విడాకులు అనంతరం నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని అస్వాదిస్తున్నాడు. కాని సమంత మాత్రం ఒంటరిగానే ఉంటుంది. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ పెళ్లిపీటల వరకు వెళ్లే అవకాశం లేకపోలేదంటున్నాయి సినీ వర్గాలు. అయితే సమంతను పెళ్లిచేసుకోవాలంటే రాజ్ నిడిమోరు తన భార్యకు విడాకులివ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమంత రెండో పెళ్లి వ్యవహారం ఏ తీరం చేరుతుందో మునుముందు తేలనుంది.