Samantha| స‌మంత క్రేజీ ప్రాజెక్ట్ డీటైల్స్ ఔట్.. ఈ సారి రూట్ మార్చేసిందిగా..!

Samantha| అందాల ముద్దుగుమ్మ స‌మంత ఖుషి చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది లేదు. మయోసైటిస్ బారిన ప‌డ‌డంతో స‌మంత సినిమాలు చేసింది లేదు. ఇక మ‌యోసైటిస్ నుండి కోలుకున్న త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ఇటీవ‌ల తన నిర్మాణంలో రూపొందుతున్న

  • Publish Date - June 29, 2024 / 11:50 AM IST

Samantha| అందాల ముద్దుగుమ్మ స‌మంత ఖుషి చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది లేదు. మయోసైటిస్ బారిన ప‌డ‌డంతో స‌మంత సినిమాలు చేసింది లేదు. ఇక మ‌యోసైటిస్ నుండి కోలుకున్న త‌ర్వాత స‌మంత మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ఇటీవ‌ల తన నిర్మాణంలో రూపొందుతున్న మా బంగారం ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్ రాకపోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. అయితే స‌మంత ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లు ఏరి కోరి ఎంపిక చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో స‌మంత ఒక వెబ్ సిరీస్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

సమంత.. త్వరలో ‘సిటాడెల్‌:హనీ బన్నీ’తో తనలోని యాక్షన్‌ కోణాన్ని చూపించ‌డానికి రెడీ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ మ‌రి కొద్ది రోజుల‌లో స్ట్రీమింగ్ కానుండ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు.అయితే స‌మంత ఇప్పుడు మ‌రో వెబ్ సిరీస్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘సిటాడెల్‌’ సిరీస్‌ల కోసం రాజ్‌ అండ్ డీకే తో జ‌త క‌ట్టి అల‌రించిన స‌మంత ఇప్పుడు యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కోసం చేతులు క‌లిపిన‌ట్టు తెలుస్తుంది. దీనికి రక్త‌బీజ్ అనే టైటిల్ పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆగ‌స్ట్ నుండి ఈ సిరీస్ షూటింగ్ మొద‌లు కానుంద‌ని స‌మాచారం.

దర్శకుడు రాజ్ అండ్ డీకే , హీరోయిన్ సమంతది క్రేజ కాంబినేష‌న్ అన్న సంగ‌తి తెలిసిందే. వారి కాంబినేష‌న్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ 2 రూపొంది మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు ర‌క్త‌బీజ్ వెబ్ సిరీస్‌తో వారు మ‌రోసారి అల‌రించ‌నున్నారని అంటున్నారు. పూర్తి యాక్ష‌న్ నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.ఇక ఇటీవ‌ల స‌మంత పాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్య స‌ల‌హాలు, సూచ‌న‌లు అందిస్తుంది.ఇది ప్ర‌జ‌ల‌లో హెల్త్ కాన్షియ‌స్ పెంచుతుంది. స‌మంత చెప్పిన విష‌యాల‌ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం, హెల్త్ టిప్స్ ఫాలో కావడం చేస్తున్నారు.

Latest News