Samantha| పొట్టి దుస్తుల‌లో స‌మంత విన్యాసాలు చూస్తే వావ్ అన‌కుండా ఉండ‌లేరు..!

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల‌తోనే కాకుండా త‌న విడాకుల విష‌యంతో వార్త‌ల‌లోకి ఎక్కింది. నాగచైతన్యతో ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత విడాకులు తీసుకొని అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక చైతూ నుండి విడిపోయా

  • Publish Date - July 3, 2024 / 09:21 AM IST

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల‌తోనే కాకుండా త‌న విడాకుల విష‌యంతో వార్త‌ల‌లోకి ఎక్కింది. నాగచైతన్యతో ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత విడాకులు తీసుకొని అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక చైతూ నుండి విడిపోయాక స‌మంత కెరియ‌ర్‌పై దృష్టి పెట్టింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా మారింది. అయితే స‌మంత స్పీడ్‌కి మ‌యోసైటిస్ బ్రేక్ వేసిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఆ వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డేందుకు స‌మంత సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి మ‌రీ ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.

కొన్నాళ్లుగా స‌మంత నిత్యం జిమ్ వ‌ర్క‌వుట్స్, యోగాతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ప‌లు ఆస‌నాలు వేస్తుంది.ఈ క్ర‌మంలో శరీరాన్ని మరింత స్ట్రాంగ్‌గా చేస్తుంది.. ఇప్పటికే మానసికంగా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకున్న స‌మంత.. తను ఫిజికల్‌గానూ అంతే బలంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. జిమ్‌లో చెమ‌ట‌లు క‌క్కేలా స‌మంత వ‌ర్క‌వుట్స్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. తాజాగా ఈ భామ‌కి సంబంధించిన వ‌ర్కవుట్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇందులో పొట్టి దుస్తులు ధ‌రించి స‌మంత చేస్తున్న ఆసనాలు అంద‌రు అవాక్క‌య్యేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ఇక స‌మంత ఇటీవల హెల్త్ గురించి పాడ్ కాస్ట్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంది. ఆమె షేర్ చేసే వీడియోలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి. స‌మంత వీడియోల‌ని చాలా మంది ఫాలో అవుతున్నారు. రీసెంట్‌గా హీనా ఖాన్ తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలో ఆమెని ఉద్దేశిస్తూ స‌మంత ఓ పోస్ట్ పెట్టింది. నీకోసం నేను ప్రార్థిస్తాను. ధైర్యంగా ఉండు అని రాసి దానికి వారియ‌ర్ అనే హ్యాష్ ట్యాగ్ త‌గిలించింది. దీనికి హీనా ఖాన్ స్పందిస్తూ.. మీరు అన్నింటిలోను స్టార్. స‌వాళ్ల‌ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతం. మీ నుండి నేను స్పూర్తి పొందాను. మీ ప్రేమ‌, ఆశీర్వ‌చ‌నాల‌కి ధ‌న్య‌వాదాలు అంటూ హీనా బ‌దులిచ్చింది.

Latest News