Samantha| టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ అందుకున్న హీరోయిన్స్‌లో సమంత తప్పక ఉంటుంది. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కో హిట్ దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. మహేష్ బాబు , ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ వంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంత సోలో చిత్రాలు కూడా చేసి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే నాగ చైతన్యతో ప్రేమలో పడ్డ ఈ భామ అతడిని వివాహం చేసుకొని, కొన్నేళ్లకి డైవర్స్ ఇచ్చింది. ఇప్పుడు సింగిల్‌గా ఉంటుంది. విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా పడింది సామ్. అయితే తన జీవితంలో ఏర్పడ్డ విచిత్ర పరిస్థితులన్నింటిని దాటుకొని సమంత ముందుకు సాగుతుంది.
సమంత చివరిగా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసింది.ఈ సినిమా తర్వాత సమంత మూవీలు ఏవి విడుదల కాలేదు. అయితే త్వరలో ”హనీ, బన్నీ” అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో సమంత పలకరించనుంది. మరో వైపు రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది.ఇవి ప్రస్తుతం సెట్స్‌పై ఉండగా, వీలైనంత తొందరగా మూవీలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే సమంత చిన్న సాయం కోసం పవన్ కళ్యాణ్ ను కలవడానికి అపాయింట్మెంట్ కోరిందట. ప్రకృతిని ఎంతో ఇష్టపడే సమంత.. చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ఈ క్రమంలో పవన్ సాయం కోసం అపాయింట్‌మెంట్ కోరిందట.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సింగపూర్ టూర్, ఇతరత్రా పనులతో బిజీగా ఉన్నందువలన ఎవ్వరికీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే సమంత అపాయింట్మెంట్ ను కూడా రిజెక్ట్ చేశారట. అయితే పరిస్థితిని అర్థం చేసుకొని…. అతనికి ఫ్రీ టైం ఉన్నప్పుడే వెళ్లి కలుస్తానని చెప్పిందట. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.