Site icon vidhaatha

Samyuktha Menon | లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన సంయుక్త మీనన్‌..! బాలీవుడ్‌ మూవీలో కీ రోల్‌..!

Samyuktha Menon | మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్‌ లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. 2016 మలయాళీ మూవీ ‘పాప్‌కార్న్‌’తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లోకి ఇంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలనే అందుకున్నాయి. అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నది.

ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదునన సంయుక్త.. తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా తదితర సీనియర్‌ నటులు నటిస్తున్న చిత్రంలో కీ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తున్నది. ఈ మూవీని తెలుగు దర్శకుడు చరణ్ తేజ్‌ నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.

ఈ సినిమాలో సంయుక్త పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతుందని టాక్‌. బాలీవుడ్‌లో తొలి సినిమానే అందాల ఆరబోత కాకుండా.. కంటెండ్ బేస్ట్‌గా ఉండబోతుండడం సంయుక్తకు మంచి అవకాశమేనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. సంయుక్త మీనన్‌ చివరిసారిగా తెలుగు డెవిల్‌ మూవీలో కనిపించింది. ప్రస్తుతం మలయాళ మూవీ రామ్ చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో నిఖిల్‌ హీరోగా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘స్వయంభూ’ చిత్రంలో కనిపించనున్నది. అదే సమయంలో శర్వానంద్ కొత్త చిత్రంలోనూ మీరోయిన్‌గా నటించనున్నది.

Exit mobile version