Site icon vidhaatha

Saranya Ponvannan | చిక్కుల్లో నటి శరణ్య.. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు..!

sharanya

Saranya Ponvannan | శరణ్య పొన్వన్నన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తల్లిపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. శరణ్య తెలుగు సినిమా ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. రఘువరన్‌ బీటెక్‌ చిత్రంలో హీరో ధనుష్‌కి తల్లిగా నటించారు. అలాగే పలు చిత్రాల్లోనూ తన నటనతో అలరించారు. నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రంలోనూ శరణ్య కీలకపాత్రలో నటించారు. విజయ్‌ దేవరకొండ, సమంత మూవీ ‘ఖుషి’లో నటించారు. ఇదిలా ఉండగా.. శరణ్య చిక్కుల్లోపడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. పార్కింగ్‌ విషయంలో పక్కింటి వారితో వివాదం చోటు చేసుకుంది.

చిన్న వివాదం కాస్త పెద్దదై పోలీస్‌స్టేషన్‌ చేరుకుంది. శరణ్యపై పక్కింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి శరణ్య తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని శ్రీదేవి అనే మహిళ పోలీసులకు తెలిపారు. శరణ్య చెన్నైలోని విరుంగబాక్కంలో నివాసం ఉంటుండగా.. పార్కింగ్‌ విషయంలో వివాదం చోటు చేసుకున్నది. తమను శరణ్య చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు పోలీసులకు గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సైతం సాక్ష్యంగా అందజేసినట్లు సమాచారం. సినిమాల్లో ఎన్నో పాపులర్‌ చిత్రాల్లో అమాయపాత్రలతో పాపులర్‌ అయిన నటి శరణ్య పొరుగువారితో గొడవకు దిగడంతో అభిమానులందరినీ షాక్‌కు గురి చేసింది.

Exit mobile version