కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా సత్యమేవ జయతే 2 రిలీజ్ ను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి సేఫ్టీని మించింది ఏదీ లేదు. జాన్ అబ్రహాం, దివ్య ఖోస్లాకుమార్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న చిత్రం సత్యమేవ జయతే 2. మిలాప్ జవేరి డైరెక్ట్ చేస్తున్నాడు.
మే 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరో తేదీన ప్రేక్షకుల ముందుకొస్తుంది. మాస్క్ ధరించండి..మనకు మనం సురక్షితంగా ఉంటూ మనల్ని ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. జైహింద్ అని చిత్రయూనిట్ పేర్కొంది. సత్యమేవ జయతే 2ను టీ సిరీస్-ఎమ్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భూషణ కుమార్, కృష్ణన్ కుమార్, నిఖిల్ అడ్వాణి నిర్మిస్తున్నారు.