Site icon vidhaatha

Atul Parchure | భారతీయ సినీ చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు అతుల్‌ పర్చురే కన్నుమూత..

Atul Parchure | భారతీయ సినీ చిత్ర పరిశ్రమలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ప్రముఖ మరాఠీ నటుడు అతుల్‌ పర్చురే (57) కన్నమూశారు. ఆయన మరణం మరాఠీ చలనచిత్రం, థియేటర్‌ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సినిమాలతో పాటు సీరియల్స్ చేయగా.. కపిల్ శర్మ షోతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆయన మరాఠీ, హిందీ సినిమాలతో పాటు టీవీ షోల్లోనూ నటించారు. క్యాన్సర్‌ కారనంగా ఆయన చాలా కారణంగా షూటింగ్‌కు దూరమయ్యారు. క్యాన్సర్‌పై పోరాడుతూ మళ్లీ ఆయన మరాఠీ సినిమాతో పాటు అలీబాబా ఆని చలిషితలే చోర్‌ టెలివిజన్‌ షోతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రీ ఎంట్రీలోనూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరాఠీలో నటకాల్లోనూ ఆయన పోషించిన పాత్రలు అందరి హృదయాలను గెలుచుకున్నాయి. పర్చురే హిందీ సినిమాల్లోనూ నటించారు. ఎందరో ప్రముఖ నటీనటులతో కలిసి తెరపై కనువిందు చేశారు. కపిల్ శర్మ షోతో మరింత ప్రజాధారణ పొందాడు. ఓ వైపు క్యాన్సర్‌పై పోరాటం చేస్తూనే నటనను కొనసాగిస్తుండగానే ఆరోగ్య సమస్యలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. అతుల్ పర్చురే మరణం భారతీయ వినోద పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

 

Exit mobile version