యాంకర్ అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ సినిమాతో రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశ్విన్ విరాజ్ హీరోగా నటించగా, అనసూయ గర్భిణిగా నటిస్తోంది. అయితే భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా గోపిచంద్ సీటీమార్, నాగ చైతన్య లవ్ స్టోరి, నాని టక్ జగదీష్, ఇక తాజాగా చిరంజీవి ఆచార్య ఇలా పలు సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరోవైపు చిన్న సినిమాలు మాత్రం ఓటిటిలో విడుదలవుతున్నాయి. తాజాగా బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ కూడా థియేట్రికల్ రిలీజ్‌ను రద్దు చేసుకుంది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మే 7న ఆహాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆహా 1.8 కోట్లకు కొన్నట్లు టాక్. అంటే దాదాపు రెండు కోట్లకు కూడా అమ్ముడుపోలేదు. మొదట థియేటర్‌లో రిలీజైన వారానికే ఓటీటీలో రిలీజ్ చేద్దామని భావించింనా పరిస్థితి అనుకూలించకపోవడంలో ఆహాలో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. అయితే అనసూయ సినిమాకు ఆహా కేవలం రెండు కోట్లే డీల్ చేసుకోవడంపై ఆమె అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఇటు నిర్మాతలు కూడా మరి ఇంత తక్కువకు ఈ సినిమాను ఎలా అమ్మారంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇక అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్పలో నటిస్తుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ యాంకర్‌గానే కాక నటిగానూ సత్తా చాటుతోంది.