Site icon vidhaatha

Shruti Haasan| బ్రేక‌ప్ త‌ర్వాత శృతి హాసన్ ఏం చేస్తుంది.. సంచ‌ల‌న్ పోస్ట్‌తో అంద‌రు షాక్..!

Shruti Haasan| అందాల ముద్దుగుమ్మ శృతి హాస‌న్ త‌న సినిమాల క‌న్నా కూడా ఎఫైర్స్ విష‌యంలోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. పెళ్లి చేసుకుంటారు అనుకున్న స‌మ‌యంలో అతనికి 2019లో బ్రేక‌ప్ చెప్పింది. అనంత‌రం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. అతనితో ఉన్న తన ప్రతి జ్ఞాపకాన్ని శృతి హాసన్ షేర్ చేసుకుంటూ నానా ర‌చ్చ చేసింది. ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. కాని అత‌నితో దిగిన పిక్స్ త‌న ఇన్‌స్టా నుండి డిలీట్ చేసింది.

ఇక తాజాగా త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారింది. తాను సింగిల్ అని, ఇకపై మింగిల్ అయ్యేది లేదని చెప్పింది. మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతుందో ఏమో కానీ ట్రాజెడీ సాంగ్స్ పాడుకుంటుంది. తన హృదయపు తలుపులు మూసేసిందట. ఇక ఎవరి కోసం తెరిచేది లేదని అర్థం వచ్చేలా నా డోర్స్‌ మూసేశాను. కీ అంటేనే అసహ్యం’ అని హీరోయిన్‌ శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక శృతి హాస‌న్ త‌న లైఫ్‌లో హీరో సిద్ధార్థ్,ధనుష్,నాగ చైతన్యలతో పాటు, ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో శృతి హాసన్ ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి.

ఇక శృతి హాస‌న్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతుంది. శృతి హాసన్ కి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. నెక్స్ట్ సలార్ 2లో శృతి హాసన్ కనిపించనుంది. అలాగే అడివి శేష్ కి జంటగా డెకాయిట్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం కెరియ‌ర్ ప‌రంగా శృతి హాస‌న్ కి బాగానే ఉన్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం చాలా డిస్ట్ర‌బ్డ్‌గా క‌నిపిస్తుంది.

Exit mobile version