Shruti Haasan| వామ్మో.. శృతి హాస‌న్ ఇంత ప‌చ్చిగా మాట్లాడిందేంటి..కొన్ని త్యాగాలు చేయాల్సిందే..!

Shruti Haasan| కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఇటీవ‌ల సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విష‌యాల‌ని షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాల పరంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాస‌న్ బ్రేక్ దొరికిన‌ప్పుడల్లా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. ఇక త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి

  • Publish Date - June 29, 2024 / 06:49 AM IST

Shruti Haasan| కోలీవుడ్ బ్యూటీ శృతి హాసన్ ఇటీవ‌ల సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విష‌యాల‌ని షేర్ చేస్తూ ఉంటుంది. సినిమాల పరంగా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాస‌న్ బ్రేక్ దొరికిన‌ప్పుడల్లా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. ఇక త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తంలో ప‌లువురితో ప్రేమాయ‌ణం కొన‌సాగించిన ఈ భామ ఆ విష‌యాల‌ని చాలా సీక్రెట్‌గా ఉంచింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొర్స‌లే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేయ‌డం మ‌నం చూశాం. ఈ విష‌యంలో శృతి ఎలాంటి దాప‌రిఖాల‌కి పోలేదు.

ఓసారి క‌మ‌ల్ హాస‌న్ ద‌గ్గ‌ర‌కు కూడా తీసుకొచ్చి ప‌రిచ‌యం చేసింది. అయితే కొన్నాళ్ల‌పాటు వారిద్ద‌రి రిలేష‌న్ బాగానే ఉన్నా 2019లో ఏవో మ‌నస్ప‌ర్ధ‌ల వ‌ల‌న బ్రేకప్ అయింది. అనంత‌రం ఈ భామ ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమాయ‌ణం న‌డిపింది. ఆయ‌న‌తో క‌లిసి తెగ ర‌చ్చ చేసింది. ఇద్ద‌రి హంగామా చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే అత‌నికి బ్రేక‌ప్ చెప్పి త‌న ఫోక‌స్ మొత్తం సినిమాల‌పైనే పెట్టింది శృతి హాస‌న్. అయితే తాజాగా శృతి హాస‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. సలార్‌లో నటించడం ప‌ట్ల శృతి హాస‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం మ‌నం చూశాం. ఆ సినిమాలో శృతికి పెద్ద‌గా స్క్రీన్ స్పేస్ ఉండ‌దు.

అస‌లు ఆ సినిమాలో ఎందుకు న‌టించారంటూ ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఆ విమ‌ర్శ‌ల‌పై తాజాగా స్పందించిన శృతి హాస‌న్.. ఒక చిత్రం ఒప్పుకునేటప్పుడు చాలా అంశాల్ని లెక్కలోకి తీసుకుంటాను. అలాగే సలార్‌లో నా పాత్ర తక్కువ సమయం ఉన్నప్పటికీ.. అది సినిమాలో కీలక పాత్ర కావ‌డంతోనే అందులో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాను అని శృతి పేర్కొంది. కొన్ని సినిమాల‌లో ఫుల్ లెంగ్త్ రోల్స్ చేసిన అవి ఫ్లాప్ అయ్యాయి. అలానే చిన్న రోల్స్ చేసిన చిత్రాలు పెద్ద విజ‌యాలు సాధించాయి. ఇవి సినిమా ఇండ‌స్ట్రీలో ఓ భాగం మాత్ర‌మే అని ఆమె కామెంట్ చేసింది. అయిన హిట్ సినిమాల్లో ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయక త‌ప్పుదు అంటూ ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Latest News