Site icon vidhaatha

Shruti Hassan|శృతి హాస‌న్ డేటింగ్ లిస్ట్ చాలా పెద్ద‌దే.. క్రికెట‌ర్‌తో స‌హా ఎంత మందితో ప్రేమాయ‌ణం న‌డిపిందంటే..!

Shruti Hassan|లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాసన్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం,ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకుంది. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో మంచి హిట్ అందుకున్న శృతి హాస‌న్ ఆ సినిమా త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో అద్భుత‌మైన సినిమాలు చేసి అల‌రించింది. అయితే శృతి హాస‌న్ ఇటీవ‌ల ఎక్క‌వగా త‌న ప్రియుడు శాంత‌నుతో క‌లిసి తెగ సంద‌డి చేస్తూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కాని ఏమైందో ఏమో కొన్నాళ్లుగా ఈ ఇద్దరు జంట‌గా క‌నిపించ‌డం లేదు, అలానే ఇన్‌స్టాలో ఒక‌రినొక‌రు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వారిద్ద‌రి బంధానికి బ్రేక్ ప‌డ్డ‌ట్టు ప్ర‌చారం అయితే జోరుగా న‌డుస్తుంది.


శాంత‌నుతో శృతి హాస‌న్ బ్రేక‌ప్ చెప్పింద‌ని వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె గ‌తంలో ఎంత‌మందితో ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని నెటిజ‌న్స్ ఆరాలు తీయ‌గా, ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శృతి హాస‌న్ మొద‌ట్లో ధ‌నుష్‌తో క‌లిసి 3 అనే సినిమా చేసింది. ఇందులో ఇంటిమేట్ సీన్స్ చేసిన‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ట‌. కొన్ని నెల‌ల పాటు ధ‌నుష్ శృతి డేటింగ్‌లో కూడా ఉన్నార‌ని ఆ త‌ర్వాత ఏదో విష‌యంలో బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ని టాక్.అక్కినేని హీరో నాగచైతన్యతో కూడా శృతీహాసన్ డేటింగ్ చేసిందన్న రూమర్ వచ్చింది. 2013 ప్రారంభంలో, శృతి హాసన్ నాగ చైతన్య కొన్ని చోట్ల జంట‌గా క‌నిపించ‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది.

ఇక టీమిండియా ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనాతో కూడా శృతీ కొన్నాళ్లు డేటింగ్ చేసిందని టాక్ గట్టిగా నడిచింది. ఈ విషయంలో సురేష్ రైనా కూడా ఓ సారి క్లారిటీ ఇచ్చారు. తాము మంచి స్నేహితుల‌మ‌ని అన్నారు. ఇక బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో 2014లో శృతి హాస‌న్ డేటింగ్ చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. వారిద్ద‌రికి సంబంధించి ఎన్నో వార్త‌లు వ‌చ్చిన కూడా ఏనాడు వారు స్పందించింది లేదు. ఇక రణబీర్ కపూర్ నుండి విడిపోయిన తర్వాత లండన్‌కు చెందిన మ్యూజిక్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో 2014 నుంచి 2016 వరకు డేటింగ్ చేసింది. ఆ స‌మ‌యంలో సినిమా ప‌రిశ్ర‌మ‌కి కూడా దూరంగా ఉంది. ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉండ‌గా, ఎందుకో సడెన్‌గా వారి బంధానికి బ్రేక్ ప‌డింది. ఇక చివ‌రిగా 2019లో శంతను హజారికా అనే టూండూల్ ఆర్టిస్ట్‌తో డేటింగ్ చేసింది. నాలుగేళ్లకు పైగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట కూడా ఇప్పుడు విడిపోయి దూరంగా ఉన్న‌ట్టు టాక్

Exit mobile version