Site icon vidhaatha

జాన్వీకపూర్ పరమ్ సుందరి ఆప్డేట్

sidharth-malhotra-janhvi-kapoors-param-sundari-gets-new-release-date-first-song-pardesiya-is-out

విధాత : అందాల తార జాన్వీకపూర్, హీరో సిద్దార్ధ్ మల్హోత్రా జంటగా నటించిన
‘పరమ్‌ సుందరి’ సినిమా నుంచి చిత్ర బృందం తాజా ఆప్డేట్ వెలువడింది. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన చిత్ర బృందం ఆవిష్కరించింది. దాంతోపాటు ఈ చిత్రంలోని ‘పరదేశియా’ అనే సాంగ్‌ను కూడా యూట్యూబ్‌ వేదికగా బుధవారం విడుదల చేశారు. ‘పరమ్‌ సుందరి’ చిత్రకథ ఉత్తర భారతదేశానికి చెందిన అబ్బాయికి, దక్షిణ భారతదేశ అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంది. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. కేరళలో అందమైన లొకేషన్ల మధ్య ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. పరదేశియా పాటలోనూ కేరళ లోకేషన్స్ ఆకట్టుకున్నాయి.

పరమ్ సుందరి మూవీ జూలై 25న విడుదల కావాల్సి ఉండగా..ఆగస్టు 29కి వాయిదా పడింది. దేవర సినిమాతో తన అందం..అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీకపూర్ పరమ్ సుందరి సినిమాతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.

Exit mobile version