Site icon vidhaatha

Vayuputra : తెలుగుతెరపై సరికొత్తగా ‘వాయుపుత్ర’

Vayuputra

విధాత : భక్తికి..శక్తికి ప్రతీకయైన దైవం ఆంజనేయుడి కథ తెలుగు తెరపై మరోసారి అలరించబోతుంది. బ్లాక్ ఆండ్ వైట్ కాలం నుంచి మొన్నటి తేజా సజ్జా(Teja Sajja) హనుమాన్(Hanuman) సినిమా వరకు అనేక సినిమాలు హనుమంతుడి కథతో మైథాలాజికల్ గా..ఫాంటసీగా..యానిమేటెడ్(Animated) సినిమాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ పరంపరలో నిర్మాత నాగవంశీ(Nagavamsi) కూడా హనుమంతుడి కథను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో సితారా ఎంటర్ టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ పై ‘వాయుపుత్ర’(Vayuputra) పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటించారు.

భారీ వీఎఫ్ఎక్స్..గ్రాఫిక్స్ సన్నివేశాలతో ఆసక్తికరంగా గొప్ప విజువల్ వండర్ గా భారీస్థాయిలో 3డీ యానిమేషన్(3D Animation) చిత్రంగా వాయుపుత్ర సినిమా రాబోతుందని నాగవంశీ వెల్లడించారు. సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హనుమంతుడు కొండపై నిలబడి లంక దహనాన్ని చూస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిగా ఉంది. ఈ సినిమాను 2026దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. యానిమేషన్ ఎపిక్(VFX) డ్రామాగా ఈ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషాల్లో పాన్ ఇండియాగా ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

Exit mobile version