Naga Chaitanya-Sobhita| అక్కినేని నాగార్జున ముద్దుల కొడుకు నాగ చైతన్య..కొన్నేళ్ల క్రితం సమంతని వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సమంత నుండి విడిపోయినప్పటి నుండి సోలోగానే ఉన్న చైతూ ఆగస్ట్ 8న హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. వారి నిశ్చితార్థం ఫొటోలని ముందుగా నాగార్జున షేర్ చేయగా, అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ఇక తాజాగా శోభిత తన ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైతేనేం.. ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అంటూ నాగ చైతన్యను ఉద్దేశించి కామెంట్ చేసింది.
‘నా తల్లి నీకేమవుతుంది?.. నా తండ్రి నీకు ఎలాంటి బంధువు? మనం ఎలా కలిస్తేనేం. మన హృదయాలు ఎర్రని భూమిలా వర్షిస్తోంది. విడిపోలేనంతగా అవి కలిసిపోయాయి’ అంటూ తమిళ కవి కురుంతోగై రాసిన పద్యం నుంచి కొన్ని పదాలను తీసుకుని తమ ఫొటోలకు దానిని క్యాప్షన్‌గా తగిలించింది శోభిత. ఇదే పోస్టును నాగచైతన్య రీపోస్ట్ చేశాడు. ఎంగేజ్‌మెంట్ తర్వాత శోభిత చేసిన తొలి పోస్ట్ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే వీరి పెళ్లికి మరి కొంత సమయం ఉందని నాగార్జున తెలియజేశారు. ఈ ఏడాది చివరిలో వారి పెళ్లి జరిపే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక చైతూ- శోభితల నిశ్చితార్థం గురువారం ఉదయం 9.42 గంటలకు జరగగా, ఆ ముహూర్తం గురించి వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. నాగచైతన్యది కర్కాటక రాశి అని, శోభితది ధనుస్సు రాశి అని, చైతూకు ఆరు, శోభితకు ఎనిమిది వచ్చాయని దీనివల్ల ఇద్దరి జాతకాల్లో షష్టకాలు వచ్చాయన్నారు. వీరిద్దరి జాతకం కలవకపోవడమే కాకుండా నిశ్చితార్థం కోసం అనుకున్న ముహూర్తం కూడా ఏ మాత్రం బాలేదని వేణు స్వామి అన్నారు. 2027 నుంచి చైతూ- శోభిత మధ్య సమస్యలు ప్రారంభమవుతాయని చెప్పిన వేణు స్వామి.. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేశాడు. అందుకు కారణం ఓ స్త్రీ అని కూడా వేణుస్వామి చెప్పారు.