Sonakshi Sinha| పెళ్లికి రెడీ అవుతున్న మ‌రో భామ‌.. డేట్ కూడా ఫిక్స్ అయిందిగా..!

Sonakshi Sinha| అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇన్నాళ్లు కెరియ‌ర్‌తో బిజీగా ఉన్న భామ‌లు సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఆ మ‌ధ్య ర‌కుల్, తాప్సీ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా పెళ్లికి రెడీ అయింది.కుమార్ వర్సెస్ కు

  • Publish Date - June 10, 2024 / 09:35 AM IST

Sonakshi Sinha| అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇన్నాళ్లు కెరియ‌ర్‌తో బిజీగా ఉన్న భామ‌లు సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఆ మ‌ధ్య ర‌కుల్, తాప్సీ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకున్నారు. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కూడా పెళ్లికి రెడీ అయింది.కుమార్ వర్సెస్ కుమారి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన‌ సునయన కూడా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది.ఇటీవలే తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. అలాగే తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అలానే అర్జున్ కూతురు ఐశ్వ‌ర్య కూడా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం అర్జున్ ఇంట పెళ్లి హంగామా న‌డుస్తుంది.

ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా కూడా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంది. హీరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన‌ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మంచి పేరు తెచ్చకుంది. మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే జూన్ 23న సోనాక్షి జ‌హీర్ ఇక్భాల్ అనే వ్య‌క్తిని పెళ్లాడ‌నున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్లు జ‌హీర్, సోనాక్షి డేటింగ్‌లో ఉండ‌గా ముంబైలో వీరి వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా ఈ జంట డేటింగ్‌లో ఉండ‌గా, త‌మ రిలేష‌న్ గురించి ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇటీవ‌ల జ‌హీర్.. సోనాక్షికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేయ‌గా, ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అయింది.

సోనాక్షి,జ‌హీర్ పెళ్లికి స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల‌తో పాటు హీరామండి న‌టీన‌టులు కూడా హ‌జ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. ఇక సోనాక్షి సిన్హా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ హీరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే పాత్ర పోషించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందింది. ఇందులో ఒక సీన్ లో తన దగ్గర పనిచేసే మహిళతో ఫోర్ ప్లే చేసే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ ను మరీ ఎక్కువగా లాగకుండా వెంటనే కట్ చేశారు. దాని గురించి ఇటీవ‌ల కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది సోనాక్షి.

Latest News