Sonakshi Sinha| ఎట్ట‌కేల‌కి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి..నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫొటోలు

Sonakshi Sinha| టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంల బాలీవుడ్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా త‌న‌కన్నా చిన్న‌వాడైన వ్య‌క్తిని వివాహం చేసుకుంది. జూన్ 23న ముంబైలో అతికొద్ది

  • Publish Date - June 24, 2024 / 07:30 AM IST

Sonakshi Sinha| టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ అంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్లి పీట‌లు ఎక్కుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంల బాలీవుడ్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా త‌న‌కన్నా చిన్న‌వాడైన వ్య‌క్తిని వివాహం చేసుకుంది. జూన్ 23న ముంబైలో అతికొద్దిమంది అతిథుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. సోనాక్షి సిన్హా , జహీర్ ఇక్బాల్ పెళ్లి వేడుక ఆమె సొంత నివాసం ‘ఆరీత్’లో జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత మామ శతృఘ్న సిన్హా, అత్తగారు పూనమ్ సిన్హాల పాదాలను తాకి జహీర్ ఇక్బాల్ సాష్టాంగ నమస్కారం చేయ‌గా,ఇక పెళ్లి పత్రాలపై సంతకం చేసిన తర్వాత జహీర్ వధువు సోనాక్షికి ముద్దు పెట్టడం అందరి దృష్టిని ఆక‌ర్షించింది.

త‌మ వివాహం గురించి సోనాక్షి సిన్హా సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఏడేళ్ల కిందట ఇదే రోజున కలిశాం.. ఒకరినొకరు చూసుకున్నాం, అదే రోజున నిర్ణయించుకున్నాం, ఆ ప్రేమ మమ్మల్ని ఇంత‌వ‌ర‌కు న‌డిపించింది. మా రెండు కుటుంబాల ప్రేమ, దీవెనలతో ఒక్కటయ్యాం అంటూ సోనాక్షి త‌న సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇక వీరి వివాహానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హ్యూమా ఖురేషి, సిద్ధార్, అదితీ రావ్ హైదరీ, అర్పితా ఖాన్, ఆయుష్ శర్మ తదితరులు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఇక జహీర్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త కాగా, ఇప్పుడు ఆ కుటుంబానికి సోనాక్షి ఇప్పుడు కోడలిగా వెళ్లింది .

సోనాక్షి- ఇక్బాల్‌లు 2022లో డబుల్ ఎక్స్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్టు బీ టౌన్ మీడియా చెప్పుకొచ్చింది. ఐదేళ్ల ముందు నుండి వీరి ప్రేమ‌, డేటింగ్‌కి సంబంధించి నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. సోనాక్షి హిందూ అమ్మాయి కాగా, ఇక్బాల్ ముస్లిం అబ్బాయి. వీరిద్దరూ మతాంతర వివాహం చేసుకుంటారని ప్ర‌చారాలు జ‌రిగిన‌ప్పుడు కొంద‌రు దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ విష‌యంలో స్వ‌యంగా సోనాక్షి త‌ల్లి, సోద‌రుడు ఆమెని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన‌ట్టు కూడా టాక్ న‌డిచింది. అయితే ఎట్ట‌కేల‌కి సోనాక్షి మాత్రం ప్రేమించిన వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌డం విశేషం.

Latest News