త్వరలో సూర్య సింగం4

విధాత :త‌మిళ స్టార్ హీరో ఇటీవ‌ల సూరారై పోట్రు..తెలుగులో ( ఆకాశం నీ హద్దురా ) సినిమాతో భారీ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాండిరాజ్, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప‌లు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక వీటి త‌ర్వాత త‌న కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సింగం మూవీకి సీక్వెల్‌గా మ‌రో చిత్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దర్శకుడు హరి సింగం 4 ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తుండ‌గా,దీనిపై ఫ్యాన్స్ సంతోషం […]

  • Publish Date - May 24, 2021 / 12:19 PM IST

విధాత :త‌మిళ స్టార్ హీరో ఇటీవ‌ల సూరారై పోట్రు..తెలుగులో ( ఆకాశం నీ హద్దురా ) సినిమాతో భారీ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాండిరాజ్, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప‌లు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక వీటి త‌ర్వాత త‌న కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సింగం మూవీకి సీక్వెల్‌గా మ‌రో చిత్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దర్శకుడు హరి సింగం 4 ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తుండ‌గా,దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

సూర్య కథానాయకుడిగా హరి దర్శకత్వంలో సింగం 4 ఆగస్ట్ నుంచి మొదటి షెడ్యూల్ ప్రారంభమవుతోంది. సింగం ఫ్రాంఛైజీలో తొలి మూడు సినిమాల్ని మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సూర్య ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా గత మూడు భాగాల కంటే భారీ స్థాయిలో ఉండేలా సింగం 4 కథ ఉండబోతోందట. ఇందులో ఎవరైనా స్టార్ హీరోతో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా స‌మాచారం అందుతుంది.

Latest News