సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

విధాత,అమరావతి: సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది’ […]

  • Publish Date - September 8, 2021 / 11:17 AM IST

విధాత,అమరావతి: సినిమా టికెట్ల బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. ‘సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే ప్రక్రియను ప్రభుత్వం నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి-విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది’ అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.

Latest News