Site icon vidhaatha

Pawan Kalyan| ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుని త‌న కొడుక్కు పెట్టాలని ప‌ట్టుబ‌ట్టి చివ‌రికి ఆ యాంక‌ర్ ఏం చేసిందంటే..!

Pawan Kalyan| పవ‌న్ క‌ళ్యాణ్ ఒక‌ప్పుడు సినిమా హీరో. కాని ఇప్పుడు ఆయ‌న ఒక డిప్యూటీ సీఎం. పిఠాపురం నుంచి బరిలో నిలిచి భారీ మెజారిటీతో విజయం సాధించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ డిప్యూటీ సీఎంతో ఆరు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అసెంబ్లీలో ఎమ్మెల్యే సాబ్‌గా సగర్వంగా అడుగుపెట్టారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా త‌న వాడి వేడి స్పీచ్‌తో దుమ్ములేప‌తున్నారు. అయితే ప‌వన్ క‌ళ్యాణ్‌ని ఎంత‌గానో ప్రేమించే యాంక‌ర‌మ్మ త‌న కొడుకు పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని పెట్టాల‌ని అత్త‌గారితోనే గొడ‌వ ఏసుకుంద‌ట‌. ఆ యాంక‌రమ్మ మ‌రెవరో కాదు హాట్ భామ స్ర‌వంతి చొక్కార‌పు ..అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు సొంతం చేసుకున్న స్ర‌వంతి ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది.

రామ్ గోపాల్ వ‌ర్మ‌తో జ‌రిపిన ఇంట‌ర్వ్యూతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. ఇక పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంట‌ర్వ్యూ కూడా ఈ భామ‌కి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇక ఆ తరువాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ మ‌రింత పాపులారిటీని అందుకుంది. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ షోలో కూడా అవ‌కాశం అందిపుచ్చుకుంది. పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రశాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న స్రవంతి ఒక కొడుకుకి జ‌న్మ‌న‌చ్చింది. అయితే స్రవంతి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కాగా, ఆమె భర్త కూడా పవర్ స్టార్ కి డై హార్డ్ ఫ్యాన్.

స్ర‌వంతి గర్భవతిగా ఉన్న‌ప్పుడు కొడుకు పుడితే.. పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే కొడుకు పుట్టాక ఈ విష‌యాన్ని ఆమె త‌న అత్త‌కి చెప్ప‌గా అందుకు స్ర‌వంతి అత్త నో చెప్పింద‌ట‌. పుట్టిన నక్షత్రాన్ని బట్టి ‘A’ అక్షరం వచ్చేలా పెట్టాలని వాళ్ళ అత్తగారు చెప్ప‌డంతో చేసేదేం లేక క‌నీసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు పేరు అయిన పెట్టాల‌ని డిసైడ్ అయి అకీరా నంద‌న్ పెట్టుకున్నార‌ట‌. ఇక న‌క్ష‌త్రం పేరుతో పెట్టినందుకు, అలానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు పేరు పెట్టినందుకు అంద‌రు హ్యాపీగా ఫీల‌య్యారు.

Exit mobile version