Site icon vidhaatha

Sreemukhi| త‌న వ‌య‌స్సు ఎంతో చెప్పిన శ్రీముఖి.. ఇక పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Sreemukhi| బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒకరు. ఆమె తన టాలెంట్‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. వయసు పెరుగుతుంటే ఈ అమ్మడు తన నాజుకైన అందాలు చూపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ ల‌తో కుర్రాళ్ల గుండెల‌లో గుబులు రేపుతుంది. మ‌రోవైపు వ‌రుస ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటూ తెగ సంద‌డి చేస్తుంది. అయితే శ్రీముఖి వ‌య‌స్సు ఎంత‌, ఆమె పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. తాజాగా శ్రీముఖి త‌న అభిమానుల‌తో ఆన్‌లైన్‌లో ముచ్చ‌టించింది.

ఈ క్ర‌మంలో శ్రీముఖిని నెటిజ‌న్స్ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగారు. నిన్ను బాగా ఇరిటేట్ చేసే ఫ్రెండ్, కేరింగ్‌గా చూసుకునే ఫ్రెండ్స్ ఎవరు? అని అడిగితే.. ఆర్జే చైతూ, అవినాష్ పేర్లను శ్రీముఖి చెప్పింది. ఇక శ్రీముఖికి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురు కాగా, దానికి ఫేమస్ డైలాగ్‌ను షేర్ చేసింది. లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టుగా.. అంటే..అది.. అరె రామ్ అంటూ బ్రహ్మానందం ఫన్నీ సీన్‌ను పెట్టేసింది.ఇంకా పెళ్లి గురించి ఇంకా ఆలోచన చేయ‌లేద‌ని, ఇప్ప‌ట్లో అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద‌న్న‌ట్టుగా శ్రీముఖి ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది. ఒక‌ప్పుడు పెళ్లిపై త‌న‌కు ఒక క్లారిటీ ఉండేది. కాని వ‌రుస ఆఫ‌ర్స్‌తో చాలా బిజీగా ఉన్న నేప‌థ్యంలో శ్రీముఖి పెళ్లి గురించి ఆలోచ‌న చేయ‌డం లేద‌ని తెలుస్తుంది.

ఇక శ్రీముఖి తన వయసు 31 అని ఓ నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక శ్రీముఖి విష‌యానికి వ‌స్తే తొలుత సినీ నటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత యాంకర్ గా మారింది. ‘పటాస్’ వంటి ప్రోగ్రామ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ … ఆ తర్వాత పలు షోలతో టాప్ యాంకర్ అవ‌తార‌మెత్తింది. ప్రస్తుతం ఆమె చేతిలో 4, 5 షోలు ఉన్నాయి. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా, జెమిని తదితర ఛానళ్లలో ఆమె షోలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతుంది.

Exit mobile version