Sreemukhi| అంత వ‌యస్సు ఉన్న క‌మెడీయ‌న్‌తో శ్రీముఖి పెళ్లా.. అంతా షాక్..!

Sreemukhi| బుల్లితెర యాంక‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి క్రేజ్ అమాంతం పెరిగింది. టాలీవుడ్‌లో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్న శ్రీముఖి షోస్‌తో పాటు అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. త‌న అందంతో పాటు హోస్టింగ్‌

  • Publish Date - May 19, 2024 / 09:30 AM IST

Sreemukhi| బుల్లితెర యాంక‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి క్రేజ్ అమాంతం పెరిగింది. టాలీవుడ్‌లో టాప్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్న శ్రీముఖి షోస్‌తో పాటు అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. త‌న అందంతో పాటు హోస్టింగ్‌తో మాయ చేస్తోన్న ఈ చిన్నది ఏదో ఒక విష‌యంతో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవ‌ల శ్రీముఖి పెళ్లి వార్త‌లు అయితే నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వాటిపై శ్రీముఖి ఏ మాత్రం స్పందించ‌క‌పోవ‌డం విశేషం.

శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తి ఆదివారం ప్ర‌సారం అయ్యే ఈ షోలో ప‌లువురు సెల‌బ్రిటీలు గెస్ట్‌లుగా వ‌చ్చి సంద‌డి చేస్తుంటారు. వారితో శ్రీముఖి, కమెడియన్ ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి కూడా సందడి చేస్తోన్నాడు. ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో భాగంగా ఈ వారం గెస్ట్‌లుగా అన్నపూర్ణమ్మ, జయలలిత, శ్రీలక్ష్మి, బాబు మోహన్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లకు యాంకర్ శ్రీముఖి తనదైన రీతిలో వెల్‌కం చెప్పింది. ఆ సమయంలో బాబు మోహన్ ‘నాకు ఎందరో ఫ్యాన్స్. కానీ, నేను శ్రీముఖి ఫ్యాన్‌ను’ అంటూ చెప్పి ఆమెను సంతోష ప‌రుస్తారు.

ఆ త‌ర్వాత ‘ఆహా నా పెళ్లంటా.. ఒహోనా పెళ్లంట..’ అనే పాటను ప్లే చేయ‌గా, సీనియర్ నటీనటులు అందరూ కలిసి డ్యాన్స్ మూమెంట్లు చేస్తూ తెగ సంద‌డి చేశారు. అయితే వాళ్ల ముందు ఫన్నీగా ఏడుస్తూ కూర్చున్న శ్రీముఖి ‘నాకెందుకు అవడం లేదు పెళ్లి’ అంటూ డైలాగ్ కొట్టింది. శ్రీముఖి పెళ్లి మాట విన‌గానే అక్క‌డే ఉన్న‌ బాబు మోహన్ ఏమాత్రం తడుముకోకుండా ‘నిన్ను పెళ్లి చేసుకోడానికి నేను రెడీగా ఉన్నా కదా’ అంటూ పంచ్ వేశారు. ఇంకేముంది సోష‌ల్ మీడియాలో బాబు మోహ‌న్‌తో శ్రీముఖి పెళ్లి అంటూ తెగ వార్త‌లు రాసేస్తున్నారు. కొంద‌రు త‌మదైన శైలిలో మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.

Latest News