Site icon vidhaatha

Suchitra krishnamoorthi| న్యూడ్ పార్టీకి వెళ్లిన హీరోయిన్.. అక్క‌డ ఒక్క‌రి ఒంటి మీద కూడా నూలు పోగు లేద‌ట‌!

Suchitra krishnamoorthi|  ఒక‌ప్పుడు బాలీవుడ్‌లో అద‌ర‌గొట్టిన అందాలు ముద్దుగుమ్మ సుచిత్రా కృష్ణ‌మూర్తి 90వ ద‌శ‌కంలో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మెప్పించింది. షారుక్ ఖాన్ తో నటించిన ‘కభీ హాన్ కభీ నా’తో సుచిత్రా కృష్ణమూర్తి పేరు ఒక్క‌సారిగా హైలైట్ అయింది. అయితే ఈ అమ్మ‌డు రీసెంట్‌గా ఓ న్యూడ్ పార్టీకి వెళ్ల‌గా, అక్క‌డ ఆమెకి చేదు అనుభ‌వం ఎదురైంద‌ని స్ప‌ష్టం చేసింది. బెర్లిన్ లోని బాడీ పాజిటివిటీ, నే*కెడ్ పార్టీకి వెళ్లాను. ఆ పార్టీకి వెళ్లి వ‌చ్చాక స్నానం చేసి గాయ‌త్రి మంత్రాన్ని జ‌పించాలనిపించాల‌ని అనిపించిందంటూ ఆమె తన సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. శరీర సానుకూలతను ప్రోత్సహించడం , శరీరానికి సంబంధించిన ఆందోళనను తొలగించడం న్యూడ్ పార్టీల ల‌క్ష్యం అంటూ సుచిత్ర తన పోస్ట్‌లో పేర్కొంది.

అయితే సుచిత్ర చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్స్ ఈపోస్ట్ పై రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాంటి పార్టీలకు మీరు ఎందుకు వెళ్తారు అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఇది మనకి సూటయ్యేది కాదు.. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ మరొక నెటిజన్ త‌న కామెంట్‌లో పేర్కొన్నాడు. మ‌రొక‌రేమో… ‘పార్టీకి నచ్చి వెళ్ళావు, ఎంజాయ్ చేసావ్.. ట్విట్టర్ లో పార్టీ బాలేదని ఫిర్యాదు చేస్తున్నావ్.. గాయత్రీ మంత్రాన్ని ఎలా జపించాలో మాకు నేర్పిస్తున్నారు. ఎందుకు? అయితే అఘోరీగా అయినా ఉండండి.. లేదా సంసారిగా అయినా ఉండండి’ అంటూ ఆమెకి ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు బాగానే ఇచ్చాడు. అయితే ఈ పార్టీ గురించి మీడియాతో జ‌రిగిన చిట్ చాట్‌లో కొన్ని వ్యాఖ్య‌లు చేసింది.

నేను 20 నుండి 30 నిమిషాలు మాత్ర‌మే ఆ పార్టీలో ఉన్నాను. రాత్రంతా పార్టీ జరిగింది. పార్టీ అది ప్రైవేట్ పార్టీ కాగా, కేవ‌లం ఆహ్వానం అందుకున్న‌వారు మాత్ర‌మే వెళ్లే పార్టీ అది. త‌న కూతురుకి ఆ పార్టీ గురించి తెలియ‌ద‌ని, తెలిస్తే తను కూల్ కాబట్టి పార్టీకి ఎలా వెళ్లాలో చెప్తుందని సుచిత్రా కృష్ణమూర్తి వెల్లడించింది. ‘అమ్మ నువ్వు ఒక బుద్ధిమంతురాలివి. రిలాక్స్ అవ్వు. పొట్టి డ్రస్సులు వేసుకో. శరీరాన్ని ఎక్స్ పోజ్ చెయ్’ అంటూ తనను ఎంకరేజ్ చేస్తుందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. నా కూతురు నాకు పూర్తిగా ఆపోజిట్. అలాంటి పార్టీల‌కి వెళితే ఇంకా ఎక్కువ‌గా నా కూతురు సంతోషిస్తుంద‌ని సుచిత్ర స్ప‌ష్టం చేసింది.

Exit mobile version