Suma| టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ తన మాటలతో ఎంతగా అలరిస్తూ ఉంటుందో మనందరికి తెలిసిందే. సినిమా ఫంక్షన్లలో తన మాటకారితనంతో ఆకట్టుకునే సుమ ఈ మధ్య వివాదాలలో ఎక్కువగా నిలుస్తుంది. రీసెంట్‌గా ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో కూరుకుపోయింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో సుమ వివరణ ఇచ్చింది. ఓ అధికారిక నోట్ విడుదల చేసింది. గతంలో నేను రాకీ అవెన్యూస్ కోసం చేసిన ప్రకటనలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో కనిపించడం నా దృష్టికి వచ్చిందన్నారు.
అయితే నేను రాకీ అవెన్యూస్‌తో 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పందం చేసుకున్నానని ప్రస్తతం ఆ సంస్థతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ సుమ వివరణ ఇచ్చింది. 2016-2018 వరకు మాత్రమే ఆ యాడ్ టెలికాస్ట్ చేసేలా ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రకటనలు రద్దు చేసినట్లు భావించాము. కాకపోతే మా అనుమతి లేకుండా ఆ యాడ్‌ని ప్రదర్శించారు. అయితే ఈ విషయంలో కొందరు బాధితులు నాకు లీగల్ నోటీసులు పంపించారు. వారికి నేను సమాధానం ఇస్తూ, ఆ సంస్థకి నోటీసులు పంపాను. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రమోషన్ వీడియోలు అఫీషియల్ చానల్స్ నుంచి వస్తే మాత్రమే నమ్మాలి. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలని నేను కోరుతున్నాను. అలానే ఈ సమయంలో నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు అంటూ లేఖలో రాసుకొచ్చింది సుమ.
వివాదం విషయంలోకి వెళితే గోదావరి జిల్లాలోని రాజమండ్రి ప్రాంతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భవన నిర్మాణాలను చేపట్టగా, ఈ వెంచర్ కోసం భారీగా ప్రమోషన్స్ చేసి వినియోగదారులను ఆకర్షించారు. పెద్ద ఎత్తున వినియోగదారులు ఈ వెంచర్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. యాంకర్ సుమ కూడా ఈ వెంచర్ కోసం వ్యాపార ప్రకటనల్లో నటించి.. తక్కువ ధరకే ఇంటిని సొంతం చేసుకొమంటూ సలహాలు ఇచ్చింది. అయితే సుమ చెప్పడంతో చాలా మంది భారీగా డబ్బు పోగు చేసుకొని మరీ ఫ్లాట్స్‌ను కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆ సంస్థ బిచాణా ఎత్తేసి పరారీలో ఉండటంతో బాధితులు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సుమ వల్లే మేము ఆ వెంచర్‌లో ప్లాట్స్ కొన్నామంటూ తమ బాధని వ్యక్తపరుస్తున్నారు.