Site icon vidhaatha

సూపర్‌ మ్యాన్ క్రియేట‌ర్ మృతి

విధాత:హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు,సూపర్‌ మ్యాన్‌ సృష్టికర్త ​​రిచర్డ్ డోనర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన సోమవారం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించారు రిచార్డ్‌ డోనర్‌. 960 టీవీల్లో ‘ట్విన్ లైట్ జోన్’ అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌తో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1978లో క్రిష్టోఫర్ రీవేతో తెరకెక్కిన ‘సూపర్ మ్యాన్’ ఈయనకు ఎనలేని క్రేజ్ తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో ఆ తర్వాత పలు చిత్రాలు తెరకెక్కాయి. తెలుగుతో పాటు హిందీలో సూపర్ మ్యాన్ స్టోరీతో పలు చిత్రాలు అదే టైటిల్‌తో తెరకెక్కాయి. 1985లో ఈయన డైరెక్ట్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన ‘గూనీస్’ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చింది. రిచర్డ్‌ మరణం పట్ల హాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Exit mobile version