ఎట్ట‌కేల‌కి హీరోయిన్ తాప్సీ పెళ్లిపై వ‌చ్చిన క్లారిటీ.. వీడియో లీక్ కావ‌డంతో బ‌య‌ట‌కి వ‌చ్చిన మేట‌ర్

  • Publish Date - April 4, 2024 / 09:20 AM IST

సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈ భామ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో ఎక్కువ‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. అయితే ఇటీవ‌ల అందాల ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న నేప‌థ్యంలో తాప్సీ కూడా పెళ్లికి సిద్ధ‌మైంద‌నే వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. తన ప్రియుడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‏ను పెళ్లి చేసుకుంటుంద‌ని మీడియాలో అనేక క‌థ‌లు వ‌స్తున్నా కూడా వారు మాత్రం స్పందించింది లేదు. అయితే సైలెంట్‌గా ఈ జంట పెళ్లి పీట‌లెక్కిన‌ట్టు తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

మార్చి చివ‌రి వారంలో తాప్సీ.. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్‏లో పెళ్లి చేసుకున్న‌ట్టు స‌మాచారం. మార్చి 23న ఉదయ్ పూర్‌లో తాప్సీ పెళ్లి జ‌రిగిన‌ట్టు స‌మాచారం. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన వీడియో లీక్ కాగా ఇందులో తాప్సీ తన స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి వేదికపైకి ఎంట్రీ ఇవ్వ‌డం మ‌నం చూడొచ్చు. ఎరుపు రంగు షర్వానీ సూట్‏లో పెళ్లి మండపానికి డ్యాన్స్ చేస్తూ వ‌చ్చిన తాప్సీ .. ఆ తర్వాత కాబోయే భర్త మథియాస్‏ను ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇది చూసిన వారంద‌రు కూడా తాప్సీకి పెళ్లి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

కాగా 2013 నుంచి తాప్సీ.. మథియాస్ బోయ్ రిలేషన్‌లో ఉండగా.. దాదాపు పదేళ్లుగా వీరి ప్రేమ బంధం కొనసాగుతూ వ‌స్తుంది. అయితే ఏ రోజు కూడా తాప్సీ త‌న ప్రేమ, పెళ్లి విష‌యాల‌పై నోరు విప్ప‌లేదు. కాని సైలెంట్‌గా ఈ భామ త‌న ప్రియుడిని వివాహం చేసుకోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అయితే పెళ్లి త‌ర్వాత అయిన క‌నీసం మీ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. ఇక తాప్సీ పెళ్లి త‌ర్వాత కూడా త‌న కెరియ‌ర్ కొనసాగించ‌నుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్‌గా ఈ భామ ఉండ‌గా, రానున్న రోజుల‌లో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌నుంది.

 

Latest News