విధాత : తమిళ సినిమా ‘మండాడి’ షూటింగ్ లో (Tamil movie Mandadi) పడవ ప్రమాదం(Boat accident) వైరల్ గా మారింది. చెన్నై బీచ్ తీరంలో సముద్రంలో పడవపై కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తుండగా టెక్నికల్ టీమ్ సిబ్బంది ఉన్న పడవ బోల్తాపడి, ఇద్దరు సిబ్బందితో పాటు కెమెరాలు సముద్రంలో పడిపోయాయి. నీటిలో పడిన సిబ్బందిని చిత్ర బృందం, వెంట ఉన్న బోటు సిబ్బంది కాపాడారు. అయితే రూ.కోటి విలువైన కెమెరాలు, ఇతర సామగ్రి సముద్రంలో మునిగిపోయాయి. తమిళ నటుడు సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ నటుడు సుహాస్ ఈ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమాను వెట్రిమారన్ నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోందుతున్న ఈ చిత్రం షూటింగ్ లో ప్రమాదం జరిగిన సమయంలో సుహాస్ అక్కడ ఉన్నారా? లేరా? అనే విషయంపై సినిమా యూనిట్ నుంచి సమాచారం అందలేదు. ప్రమాదానికి సబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళ సినిమా ‘మండాడి’ షూటింగ్లో ప్రమాదం!
చెన్నై బీచ్ తీరంలో షూట్ చేస్తుండగా టెక్నికల్ క్రూ ఉన్న పడవ బోల్తాపడి, ఇద్దరు సిబ్బందితో పాటు కెమెరాలు సముద్రంలో పడిపోయాయి. నీటిలో పడిన వారిని చిత్ర బృందం కాపాడింది.
రూ.కోటి విలువైన కెమెరాలు, ఇతర సామగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి.
— greatandhra (@greatandhranews) October 5, 2025