విధాత:కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినప్పటికి నిర్మాతలు ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం లేదు. అంతేగాక ఇప్పుడు కొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు కొందరు నిర్మాతలు. తమ సినిమాలు థియేటర్స్‌లో విడుదలై సూపర్ హిట్ సాధించి వసూలు చేసే మొత్తం కంటే కూడా ఓటీటీ సంస్థలు ఇంట్రటెస్టింగ్ ఆఫర్స్‌తో ముందుకొస్తున్నాయి.
దీంతో ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్దమవుతున్నాయంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తాజా బచ్ ప్రకారం యేయే సినిమాలు ఓటీటీ ఎంత ఆఫర్లు పలుకుతున్నాయో ఓ సారి ఇక్కడ ఓ లుక్కేయండి.
సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ డీల్
వెంకటేశ్ దృశ్యం 2 డిస్నీ హాట్ స్టార్ 36 కోట్లు
నితిన్ మాస్ట్రో డిస్నీ హాట్ స్టార్ 28 కోట్లు
శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు 39 కోట్లు
నాని టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్లు
గోపీచంద్ సీటీమార్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు 16 కోట్లు అంచనా
శర్వానంద్ మహా సముద్రం నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు 21 కోట్లు
ఇవే కాక మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి సిద్ధమైనట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఇఫ్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ పుంజుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే అప్పటి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఆపకుండా ఓటీటీకే ఇచ్చేయాలని చూస్తున్నారు నిర్మాతలు.