Suicide : టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర మృతి చెందిన ఘటనను మరువకముందే మరో నటులు ఉరేసుకుని ఉసురు తీసుకున్నాడు. త్రినయని సీరియల్‌తో బాగా పేరు తెచ్చుకున్న సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలోగల తన నివాసంలో ఉరేసుకుని మరణించాడు. చందుకు త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్‌లో చందు నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చందు 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్రతో చందుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే కారణంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చందు ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.