Thamma First Song Tum Mere Na Huye | థామాలో రష్మిక హాట్ డ్యాన్స్

రష్మిక ‘థామా’ సినిమాలో హాట్ డ్యాన్స్ తో అందాలను ప్రదర్శించగా, లవ్ సాంగ్ యూత్‌ను ఆకర్షిస్తోంది

thamma-first-song-rashmika-mandanna-and-ayushmann-khurrana-romantic-song-release

విధాత : నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్ మూవీ ‘థామా’లో ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకత్వం వహించిన ఈ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ నుంచి రోమాంటిక్ లవ్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘కొన్ని ప్రేమ కథలకు ఎప్పటికీ మరణం ఉండదు’ అంటూ టీమ్‌ ఈ వీడియో సాంగ్‌ను పంచుకుంది. ఈ సాంగ్ లో రష్మిక డ్యాన్స్ హాట్ హాట్ స్టెప్పులతో పాటు అందాల ప్రదర్శనతో సాగింది.

యూత్‌ను ఆకట్టుకునేలా మరింత గ్లామర్‌గా ఈ సాంగ్‌ కోసం రష్మిక కనిపించింది. అలాగే సినిమా కథకు సంబంధించిన సన్నివేశాలు కొన్ని కూడా పాటలో అంతర్బాగంగా కనిపించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినమాపై అంచనాలు పెంచింది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 21న థామా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్ సినిమాలతో దూసుకపోతున్న రష్మిక హర్రర్ థ్రిల్లర్ థామాతో మరో హిట్ కొట్టనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్, ఆల్లు ఆర్జున్ ఆట్లీ, అలాగే ‘పుష్ప 3: ది ర్యాంపేజ్, మైసా, రెయిన్‌బో’ ‘కాక్‌టెయిల్’ సీక్వెల్‌ సినిమాలో బిజీగా ఉంది.

 

 

Exit mobile version