Kalki Movie Temple | కల్కి మూవీలో అశ్వత్థామ ఎంట్రీ ఇచ్చే ఆలయం ఇదే..! మన తెలుగు రాష్ట్రాల్లోనేది ఈ శివాలయం..!

Kalki Movie Temple | పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన మూవీ బాక్సాపీస్‌ వద్ద రికార్డులను సృష్టిస్తున్నది. ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇక మూవీలో అబితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హసన్‌, బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు పలువురు అగ్రతారలు ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. ఇది ఇలా ఉండగా.. మూవీలో ఓ శివాలయం కనిపించింది.

Kalki Movie Temple | పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన మూవీ బాక్సాపీస్‌ వద్ద రికార్డులను సృష్టిస్తున్నది. ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇక మూవీలో అబితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హసన్‌, బాలీవుడ్‌ బ్యూటీలు దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు పలువురు అగ్రతారలు ప్రత్యేక పాత్రల్లో మెరిశారు. ఇది ఇలా ఉండగా.. మూవీలో ఓ శివాలయం కనిపించింది. అశ్వత్థామ గుడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూవీలో అశ్వత్థామ ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ ఆలయం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఆలయం గురించి సోషల్‌ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

ఇక ఆలయంలో శివాలయం నెల్లూరు జిల్లాలోని పెరుమాళ్లాపురం గ్రామం సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉన్నది. పెన్నా నది వరదలకు ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆలయం రెండు సంవత్సరాల కిందట వెలుగు చూసింది. కరోనా సమయంలో గ్రామస్తులు ఆలయం నది ఒడ్డున తవ్వకాలు జరుపుతున్న సమయంలో వెలుగులోకి వచ్చింది. దాదాపు 300 సంవత్సరాల కిందట ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలో ‘విలేజ్‌ విహారీ’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌గా ఉన్నది. ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో కల్కి సినిమాలో రిలీజ్‌ అయ్యాక మరోసారి అప్‌లేడ్‌ చేశారు.

వీడియోలో ప్రస్తుతం ఆలయ గోపురం మాత్రం బయటకు కనిపిస్తుంది. ఇసుకలో కూరుకుపోయిన ఆలయంలోకి వెళ్లేందుకు గ్రామస్థులు చిన్న మార్గం చేసి లోపల ఉన్న ఇసుకను తొలగించారు. దాంతో ఆలయంలో ఉన్న శివలింగం స్పష్టంగాకనిపిస్తున్నది. ఈ ఆలయంలో ఇసుకలో కూరుకుపోయి చిన్నగా కనిపిస్తున్నా.. ఆలయంలోకి వెళ్లి చూస్తే మాత్రం గోపురం చాలా ఎత్తులో కనిపిస్తున్నది. బయట శిఖరం నాలుగు వైపులా నందులతో, ఇతర శిల్పాలతో ఉన్నది. ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో లోపల ఉన్న విగ్రహాలను ఇతర తరలించారు. ఆలయంలో బయటపడిన శిల్పాలను పురావస్తుశాఖ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.